
కాన్పూర్ వేదికగా భారత్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ వీరాభిమాని 'టైగర్ రాబీ'పై దాడి జరిగింది. కొందరు ఆకతాయిలు రాబీ వీపు, పక్కటెముకలపై దాడి చేసినట్లు తెలుస్తుంది. పోలీసులు రాబీని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాబీ డీహైడ్రేషన్‌తో బాధపడుతూ మాట్లాడలేకపోతున్నాడు. దాడికి గత కారణాలు తెలియాల్సి ఉంది.
కాగా, తొలి రోజు భారత బౌలింగ్ సందర్భంగా రాబీ సి బ్లాక్ బాల్కనీ నుండి వారి జాతీయ జెండాను ఊపుతూ, నినాదాలు చేస్తూ కనిపించాడు. మొదటి సెషన్‌లో అతను కొంతమంది భారత అభిమానులతో వాదనకు దిగాడు. బహుశా ఈ సందర్భంగానే రాబీపై దాడి జరిగి ఉండవచ్చు.
Bangladeshi fan Tiger Roby was beaten by some people.
- The Kanpur police took him to the hospital. pic.twitter.com/F3ZwKqvarM— Mufaddal Vohra (@mufaddal_vohra) September 27, 2024
ఇదిలా ఉంటే, రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట వర్షం కారణంగా అర్దాంతరంగా ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. జకీర్ హసన్ (0), షద్మాన్ ఇస్లాం (24), నజ్ముల్ హసన్ షాంటో (31) ఔట్ కాగా.. మొమినుల్ హక్ (40), ముష్ఫికర్ రహీం (6) క్రీజ్‌లో ఉన్నారు.
భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్ రెండు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్‌కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభం నుంచి వెలుతురు లేమి, వర్షం కారణంగా పలు మార్లు అంతరాయాలు కలిగాయి. 35 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేశారు.
చదవండి: జడేజా ప్రపంచ రికార్డు.. 147 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment