చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ముందు భారత్ ఏకంగా 515 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన పర్యాటక జట్టు మూడో రోజు ముగిసే సమయానికి 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
బంగ్లా జట్టు విజయం సాధించాలంటే ఇంకా 357 పరుగులు అవసరం. భారత్ విజయానికి మరో 6 వికెట్లు కావాలి. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లో యువ క్రికెటర్లు రిషబ్ పంత్(109), శుబ్‌మన్ గిల్(119) సెంచరీలతో చెలరేగారు. దీంతో భారత్ 287/4 వద్ద తమ సెకెండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
యశస్వీ కళ్లు చెదిరే క్యాచ్..
ఇక మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత యువ కెరటం యశస్వీ జైశ్వాల్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. కళ్లు చెదిరే క్యాచ్‌తో బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్‌ను పెవిలియన్‌కు పంపాడు. బంగ్లా ఇన్నింగ్స్ 15 ఓవర్‌లో బుమ్రా.. రెండో బంతిని జకీర్ హసన్‌కు ఆఫ్ స్టంప్ వెలుపల సంధించాడు.
దీంతో జకీర్ కవర్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం థిక్ ఎడ్జ్ తీసుకుని గల్లీ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో గల్లీలో ఉన్న జైశ్వాల్ ఎడమవైపు డైవ్ చేసి ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
ఇది చూసిన భారత ఆటగాళ్లందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. శుబ్‌మన్ గిల్ అయితే తన రెండు చేతులను తలపై ఉంచి షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చదవండి: భారీ లక్ష్యం.. బంగ్లాదేశ్ ఒక్కటీ గెలవలేదు!.. టీమిండియాదే విజయం?
Jasprit Bumrah with the first breakthrough as Yashasvi Jaiswal takes a brilliant catch to dismiss Zakir Hasan.
Watch 👇👇
Live - https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/KdWyAW1yIN— BCCI (@BCCI) September 21, 2024
Comments
Please login to add a commentAdd a comment