IND vs NZ 1st: పటిష్ట స్థితిలో న్యూజిలాండ్‌ | IND vs NZ 1st Test Day 2 Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IND vs NZ 1st: పటిష్ట స్థితిలో న్యూజిలాండ్‌

Published Thu, Oct 17 2024 8:52 AM | Last Updated on Thu, Oct 17 2024 5:37 PM

IND vs NZ 1st Test Day 2 Live Updates And Highlights

IND vs NZ 1st Test Day 2 Updates And Highlights: టీమిండియాతో తొలి టెస్టులో న్యూజిలాండ్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 46 పరుగులకే ఆలౌట్‌ చేసిన కివీస్‌ జట్టు.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. డెవాన్‌ కాన్వే అద్భుత ఇన్నింగ్స్‌ వల్ల.. రెండో రోజు ఆట ముగిసే సరికి 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 180 పరుగులు సాధించింది. 

గురువారం నాటి ఆటలో ఓపెనర్‌, కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌(15) విఫలం కాగా.. మరో ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే 91 పరుగులతో దుమ్ములేపాడు. విల్‌ యంగ్‌ 33 పరుగులు చేయగా.. రచిన్‌ రవీంద్ర 22, డారిల్‌ మిచెల్‌ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.
 

39.1: కాన్వే అవుట్‌
టీమిండియాకు కీలక వికెట్‌ దక్కింది. సెంచరీకి చేరువగా వచ్చిన కివీస్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే అవుటయ్యాడు. 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. దీంతో కివీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. రచిన్‌ 10 పరుగులతో ఆడుతుండగా.. డారిల్‌ మిచెల్‌ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 154/3 (39.1). 

36.3: రెండో వికెట్‌ కోల్పోయిన కివీస్‌
రవీంద్ర జడేజా బౌలింగ్‌లో విల్‌ యంగ్‌(33) కుల్దీప్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. కాన్వే 89 పరుగులతో ఆడుతున్నాడు. రచిన్‌ రవీంద్ర క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 143-2(37 ఓవర్లలో)

తొలి వికెట్‌ డౌన్‌
కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో టామ్‌ లాథమ్‌(15) లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కాన్వే 51 పరుగులతో ఆడుతున్నాడు. 17.1 ఓవర్లలో కివీస్‌ స్కోరు: 67-1. విల్‌ యంగ్‌ క్రీజులోకి వచ్చాడు.

నిలకడగా ఆడుతున్న కివీస్‌ ఓపెనర్లు..
న్యూజిలాండ్‌ నిలకడగా ఆడుతోంది. 7 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు టామ్‌ లాథమ్‌(6), కాన్వే(21) ఉన్నారు.

3 ఓవర్లకు కివీస్‌ స్కోర్‌: 10/0
3 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు టామ్‌ లాథమ్‌(6), కాన్వే(4) ఉన్నారు.

46 పరుగులకే టీమిండియా ఆలౌట్‌..
తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఘోర ప్రదర్శన కనబరిచారు. న్యూజిలాండ్ పేసర్ల దాటికి భారత్ కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ 5 వికెట్లతో నిప్పులు చేరిగాడు. అత‌డితో పాటు యువ పేస‌ర్ విలియం ఓ రూర్క్ 4 వికెట్లు, సౌథీ త‌లా వికెట్‌తో భార‌త ప‌త‌నాన్ని శాసించారు.

టీమిండియా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌గా వెనుదిరిగారు. విరాట్ కోహ్లి, సర్ఫరాజ్‌ఖాన్‌, కేఎల్ రాహుల్‌, జడేజా, అశ్విన్‌లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. కెప్టెన్ రోహిత్ శర్మ(2), జైశ్వాల్‌(13) పరుగులు మాత్రమే చేశారు. కాగా భార‌త్‌కు ఇది టెస్టుల్లో మూడో అత్య‌ల్ప స్కోర్ కావ‌డం గ‌మ‌నార్హం.

ఆలౌట్‌కు చేరువలో భారత్‌
తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్‌కు చేరువైంది. 39 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. లంచ్‌ విరామం తర్వాత మాట్‌ హెన్రీ వరుస క్రమంలో అశ్విన్‌,పంత్‌ను పెవిలియన్‌కు పంపాడు.

34 పరుగులకే 6 వికెట్లు
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఐదో వికెట్‌గా కేఎల్‌ రాహుల్‌(0), ఆరో వికెట్‌గా జడేజా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.

భారత్‌ నాలుగో వికెట్‌ డౌన్‌..
భారత్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన జైశ్వాల్‌.. ఓ రూర్క్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌.. సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. క్రీజులోకి కేఎల్‌ రాహుల్‌ వచ్చాడు.

వర్షం అంతరాయం..
బెంగళూరు వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిపోయో సమయానికి భారత్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి కేవలం 13 పరుగులు మాత్రమే చేసింది.

కష్టాల్లో భారత్‌..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు కివీస్ పేసర్లు చుక్కలు చూపిస్తున్నారు. 12 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్ శర్మ(2) సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితం కాగా.. విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం క్రీజులో యశస్వీ జైశ్వాల్‌(8), రిషబ్‌(3) ఉన్నారు.

భారత్‌ తొలి వికెట్‌ డౌన్‌..
9 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చేసిన రోహిత్‌ శర్మ.. టిమ్‌ సౌథీ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి కోహ్లి వచ్చాడు.

6 ఓవర్లకు భారత స్కోర్‌: 9/0
6 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో జైశ్వాల్‌(7), రోహిత్‌ శర్మ(2) పరుగులతో ఉన్నారు. తొలి సెషన్‌లో బంతి అద్భుతంగా స్వింగ్‌ అవుతోంది. దీంతో కివీస్‌ పేసర్లు భారత ఓపెనర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు.

తొలుత బ్యాటింగ్‌ భారత్‌దే..
బెంగళూరు వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. వర్షం కారణంగా తొలి రోజు ఆట మొత్తం తుడిచిపెట్టుకు పోయింది. దీంతో రెండో రోజు టాస్‌ వేశారు. 

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు భారత స్టార్‌ ప్లేయర్‌ శుబ్‌మన్‌ గిల్‌ దూరమయ్యాడు. అతడి స్ధానంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ తుది జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు
న్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్‌), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్ కీప‌ర్‌), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
చదవండి: LLC 2024: యూసఫ్‌ పఠాన్‌ ఊచకోత.. అయినా పాపం?(వీడియో)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement