అభిమానులతో ఆనందం పంచుకుంటున్న రోహిత్ శర్మ(PC: BCCI)
India Vs West Indies 4th T20- Rohit Sharma: తొలుత టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్‌గా నియమితుడై సారథిగా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టాడు రోహిత్ శర్మ. టీ20 ప్రపంచకప్-2021 ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌తో కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో వరల్డ్‌కప్ రన్నరప్ కివీస్‌ను 3-0తో టీమిండియా క్లీన్‌స్వీప్ చేయడంతో అద్వితీయ విజయం అందుకున్నాడు.
అప్పటి నుంచి కెప్టెన్‌గా రోహిత్ శర్మ విజయ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. న్యూజిలాండ్ తర్వాత స్వదేశంలో రోహిత్ సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌ను వన్డే, టీ20 సిరీస్‌లలో 3-0తో వైట్‌వాష్ చేసింది. అదే జోష్‌లో సొంతగడ్డపై.. శ్రీలంకకు చుక్కలు చూపించి టీ20 సిరీస్‌ను 3-0తో.. అదే విధంగా వన్డే సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
విదేశీ గడ్డ మీద..
ఈ క్రమంలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన రోహిత్ సేన.. బట్లర్ బృందానికి సైతం చేదు అనుభవాన్ని మిగిల్చింది. టీ20 సిరీస్, వన్డే సిరీస్‌లను 2-1తో గెలిచి ఆతిథ్య ఇంగ్లండ్‌కు ఝలక్ ఇచ్చింది. ఇక తాజాగా వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే రోహిత్ సేన 3-1తో కైవసం చేసుకుంది. ఇలా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా జైత్రయాత్ర కొనసాగిస్తూ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
నువ్వు తోపు..
పూర్తిస్థాయిలో కెప్టెన్సీ చేపట్టిన తర్వాత స్వదేశీ, విదేశీ గడ్డపై ఆడిన ఎనిమిదింటికి ఎనిమిది ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచి సత్తా చాటాడు. దీంతో హిట్‌మ్యాన్ అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ‘‘అపూర్వ.. అసాధారణ విజయాలు సాధించిన రోహిత్ శర్మ.. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(G.O.A.T)’’ అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
‘‘తోపు కెప్టెన్’’ అంటూ ఆకాశానికెత్తుతున్నారు. ఇదే ఊపులో ఆసియా కప్, ప్రపంచకప్ గెలవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. కాగా భారత్- వెస్టిండీస్ మధ్య ఐదో టీ20 ఆదివారం(ఆగష్టు 7) జరుగనుంది. ఇక ఆగష్టు 27న ఆసియా కప్ టోర్నీ, అక్టోబరు 16న టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందు రోహిత్ సేన స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుంది.
చదవండి: Rohit Sharma-Rishabh Pant: పంత్ ప్రవర్తనపై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్
Rohit Sharma: ఎవరైనా ఒకటీ రెండు మ్యాచ్‌లలో విఫలమవుతారు! అప్పుడు ఫెయిల్.. ఇప్పుడు హీరో!
Thanking fans & appreciating their support - Captain @ImRo45 way! 😊 👏
— BCCI (@BCCI) August 7, 2022
🎥 Scenes after #TeamIndia's win in the 4⃣th #WIvIND T20I in Florida. 👍 👍 pic.twitter.com/XzORF1rCUc
Comments
Please login to add a commentAdd a comment