Ind Vs Wi 3rd T20: వెస్టిండీస్‌తో రెండో టీ20 మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ మూడో మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సమాచారం. వీరిద్దరికి విశ్రాంతినిచ్చేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కోహ్లి, పంత్‌ను బయో బబుల్ నుంచి విడుదల చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరిద్దరు ఇంటికి వెళ్లి 10 రోజుల పాటు కుటుంబ సభ్యులతో గడిపేందుకు అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే 2-0 తేడాతో టీమిండియా టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విండీస్‌తో నామమాత్రపు మూడో మ్యాచ్‌కు కోహ్లి, పంత్‌కు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇక మూడో మ్యాచ్‌తో పాటు శ్రీలంకతో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా ఈ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ దూరం కానున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా... కోల్‌కతా వేదికగా జరిగిన రెండో టీ20లో రోహిత్ సేన 8 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లి, పంత్ అర్ధ శతకాలతో రాణించారు. 28 బంతుల్లోనే 52 పరుగులు చేసిన రిషభ్ పంత్ అద్భుత ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఫిబ్రవరి 20న టీమిండియా- విండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది.
చదవండి: IPL 2022 Auction: వేలంలో 1.5 కోట్లు.. భారత జట్టు సభ్యుడు, సీఎస్‌కే ఆటగాడిపై సంచలన ఆరోపణలు! ధోని నమ్మకం గెలిచాడు కానీ..
Mohammed Siraj- Virat Kohli: కోహ్లి టోలీచౌకీకి వచ్చాడోచ్..! నా జీవితంలోనే బెస్ట్ సర్‌ప్రైజ్.. భయ్యాను చూడగానే గట్టిగా హగ్ చేసుకున్నా!
🙌🙌#TeamIndia @Paytm #INDvWI pic.twitter.com/NjrkDCxt2q
— BCCI (@BCCI) February 18, 2022
Comments
Please login to add a commentAdd a comment