Rohit Sharma Most Ducks In IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ పేరిట చెక్కు చెదరని రికార్డుతో పాటు అత్యంత చెత్త రికార్డు కూడా నమోదై ఉంది. 2011 నుంచి ముంబై ఇండియన్స్‌లో భాగమైన హిట్ మ్యాన్.. తన సారధ్యంలో ఆ జట్టును 5 సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు ఇన్ని టైటిల్స్ నెగ్గలేదు. ఈ చెక్కు చెదరని రికార్డుతో పాటు రోహిత్ పేరిట అత్యంత చెత్త రికార్డు కూడా నమోదై ఉంది. ఐపీఎల్-2021 పునఃప్రారంభం నేపథ్యంలో రోహిత్ పేరిట ఉన్న ఆ చెత్త రికార్డుపై ఓ లుక్కేద్దాం.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన అప్రతిష్టను రోహిత్ మూటగట్టుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో రోహిత్ ఏకంగా 13 సార్లు డకౌటయ్యాడు. ఈ చెత్త రికార్డును రోహిత్‌తో పాటు మరో నలుగురు(హర్భజన్, పార్ధివ్ పటేల్, రహానే, అంబటి రాయుడు) షేర్ చేసుకున్నారు. రోహిత్ తర్వాత అత్యధిక సార్లు డకౌటైన ప్రస్తుత స్టార్ ఆటగాళ్లలో మనీష్ పాండే(12), మ్యాక్స్‌వెల్(11), ధవన్(11), రషీద్ ఖాన్(9), ఏబీ డివిలియర్స్(9), సంజూ సామ్సన్(8) , క్రిస్ గేల్(8), సురేష్ రైనా(8) ఉన్నారు.
ఇక ఈ చెత్త రికార్డును పక్కకు పెడితే.. రోహిత్ పలు ఐపీఎల్ రికార్డుల జాబితాలో ముందువరుసలో ఉన్నాడు. లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం(5480), అత్యధిక సిక్సర్ల(224) జాబితాలో మూడో స్థానం, అత్యధిక ఫోర్ల(476) జాబితాలో ఆరో స్థానంలోనిలిచాడు. ఐపీఎల్‌లో రోహిత్ ఇప్పటివరకు 207 మ్యాచ్‌ల్లో 130కు పైగా స్ట్రయిక్ రేట్‌లో 5480 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 40 అర్ధసెంచరీలున్నాయి. ఇదిలా ఉంటే, నేడు జరుగబోయే ఐపీఎల్ సెకెండ్ ఎడిషన్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.
చదవండి: బ్లూ జెర్సీలో ఆర్సీబీ.. మ్యాచ్ తర్వాత ఏం చేస్తారంటే..?
Comments
Please login to add a commentAdd a comment