Photo Courtesy: IPL
ముంబై: ‘ఈసాలా కప్ నమ్దే’ అన్న మాటలను నిజం చేసే దిశగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్–14 సీజన్‌లో తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. విరాట్ కోహ్లి తన ఫామ్‌ని కొనసాగించడమే కాకుండా, చేజింగ్‌లో చివరివరకు నిలబడి తన జట్టుకి విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అదే క్రమంలో ఐపీఎల్ 2021 సీజన్‌లో విరాట్ తన మొదటి అర్ధ సెంచరీని సాధించాడు. అనంతరం హెల్మెట్ తీసి ఈ అర్ధ సెంచరీని తన కూతురు వామికాకు అంకితమిచ్చాడు. క్రికెటర్లు సాధించే సెంచరీ, అర్ధ సెంచరీలు, రికార్డులను కొన్ని సందర్భాల్లో తమ కుటుంబ సభ్యులకు అంకితమివ్వడం మనం చూస్తూనే ఉంటాం.
విరాట్ తన అర్ధ సెంచరీ పూర్తి చేసిన తరువాత తన బ్యాట్‌ను డగౌట్‌లోని ఆర్సీబీ సభ్యుల వైపు చూపిస్తూ అభివాదం చేశాడు. అనంతరం కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు గాల్లో ముద్దులు పెడుతూ తన ఆనందాన్ని ఈ రకంగా పంచుకున్నాడు. ఈ క్రమంలోనే సీజన్‌లో మొదట అర్ధ సెంచరీని తన కూతురు వామికాకు అంకితమిస్తున్నట్లుగా కోహ్లి సైగలు చేసి చూపించాడు. బీసీసీఐ ఈ వీడియోను ఐపీఎల్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ వీడియోను చూసిన విరాట్ అభిమానులు.. ‘ రాజు ఎప్పుడూ రాజే ’ అని ఒకరు , ‘ఆర్సీబీ ఇస్ సాల్ కప్ లే జయెగి దేఖ్ లెనా బాస్ ( ఆర్సీబీ ఈ ఏడాది ఐపిఎల్ ట్రోఫీని ఖచ్చితంగా గెలుచుకుంటుంది, వేచి చూడండి ) ’అని మరొకరు కామెంట్ పెట్టారు. మ్యాచ్ గెలిపించడంలో కీలక పాత్ర పోషించడమే కాక తన భార్య, కూతురు పై ఉన్న ప్రేమ ఒకేసారి కోహ్లి ఈ విధంగా చూపించాడు. వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్దేశించిన 178 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. కోహ్లి బృందం 16.3 ఓవర్లలో వికెట్ నష్టకోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. 178 పరుగుల ఛేజింగ్‌లో ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ అజేయ శతకం (52 బంతుల్లో 101 నాటౌట్; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో కదం తొక్కగా... కెప్టెన్ విరాట్ కోహ్లి (47 బంతుల్లో 72 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు.
( చదవండి: ఐపీఎల్ 2021: ఎట్టకేలకు కావ్య పాప నవ్వింది.. )
Comments
Please login to add a commentAdd a comment