
Photo Courtesy: BCCI/IPL
చెన్నై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిని మ్యాచ్ రిఫరీ ఫరీ వెంగలిల్ నారాయణ్ కుట్టీ మందలించాడు. తను ఔటవడాన్ని జీర్ణించుకోలేకపోయిన కోహ్లి పెవిలియన్ వెళ్తూ అడ్వర్టైజ్‌మెంట్ కుషన్, కుర్చీని తన్నేశాడు. దీంతో అతను మందలింపునకు గురయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లి 29 బంతుల్లో 33 పరుగులు చేసిన తర్వాత జేసన్ హోల్డర్ వేసిన 13 ఓవర్ తొలి బంతికి అతడు భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు.
బ్యాట్ అంచుకు తగిలిన బంతిని ఫీల్డర్ విజయ్ శంకర్ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి ఆ క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్రమంలో అవేశానికి గురైనా అతను డగౌట్‌కు వెళ్తూ అడ్వర్టైజ్‌మెంట్ కుషన్, కుర్చీని బ్యాట్‌తో కొట్టాడు. ఇది ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘన కిందకు రావడంతో అతన్ని నిర్వహాకులు మందలించారు. ఐపీఎల్ నియమావళిలోని లెవల్ 1 నిబంధనల్లో 2.2 ఉల్లంఘన కిందకు వస్తుంది. క్రికెట్ ఎక్విప్‌మెంట్, గ్రౌండ్ ఎక్విమెంట్‌ను పాడుచేయడం కిందకు వస్తుంది. దాంతో కోహ్లిని రిఫరీ మందలింపుతో సరిపెట్టాడు. దీనికి మ్యాచ్ ఫీజులు కూడా ఉంటుంది. కానీ రిఫరీ మాత్రం కోహ్లిని మందలించి వదిలేశారు. 2016లో బెంగళూర్,కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో ఇలానే గౌతమ్ గంభీర్ చేయడంతో అతడి మ్యాచ్ ఫీజులో 15% కోత విధించిన సంగతి తెలిసిందే.
ఇక్కడ చదవండి: ఇది వార్నర్ తప్పిదం కాదా?
Comments
Please login to add a commentAdd a comment