
PC: IPL Twitter
సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. సీఎస్‌కే.. గుజరాత్‌తో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు అర్ధ సెంచరీలు సాధించి, ఇరు జట్లలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
నిన్నటి మ్యాచ్‌లో 36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసిన రుతురాజ్.. ఈ సీజన్‌లో తన నాలుగో హాఫ్ సెంచరీ (60) నమోదు చేయడంతో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సైతం గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 15 మ్యాచ్‌లు ఆడిన రుతు.. 43.38 సగటున, 146.88 స్ట్రయిక్ రేట్‌తో 564 పరుగులు చేసి, లీగ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో 6వ స్థానంలో నిలిచాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్‌కే ఆటగాళ్లు సమష్టిగా రాణించి గుజరాత్‌ను 15 పరుగుల తేడాతో ఓడించారు. ఫలితంగా సీఎస్‌కే 10వ సారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
రుతురాజ్ గైక్వాడ్ (44 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్), డెవాన్ కాన్వే (34 బంతుల్లో 40; 4 ఫోర్లు) రాణించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (38 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు.
చదవండి: IPL 2023 QF 1: సీఎస్‌కే-గుజరాత్ మ్యాచ్‌పై అనుమానాలు.. ఫిక్స్ అయ్యిందా..?