తిలక్ వర్మ- మాక్స్‌వెల్‌తో కోహ్లి (Photo Credit: IPL Twitter)
IPL 2023- RCB Beat MI By 8 Wickets- బెంగళూరు: అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ టైటిల్‌ను ఈసారైనా సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కొత్త సీజన్‌లో శుభారంభం చేసింది. ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఫ్లాఫ్ డు ప్లెసిస్ నాయకత్వంలోని బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
తిలక్ వర్మ చెలరేగాడు.. కానీ
మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. హైదరాబాద్ యువ క్రికెటర్ ఠాకూర్ తిలక్ వర్మ (46 బంతుల్లో 84 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అసాధారణ బ్యాటింగ్‌తో అర్ధ సెంచరీ సాధించి అజేయంగా నిలిచాడు.
తిలక్ వర్మ పుణ్యమాని ముంబై గౌరవప్రద స్కోరు సాధించగలిగింది. అనంతరం బెంగళూరు జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడి కేవలం 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 172 పరుగులు సాధించి గెలుపొందింది.
ఓపెనర్లు విరాట్ కోహ్లి (49 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డు ప్లెసిస్ (43 బంతుల్లో 73; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు) ముంబై బౌలర్ల భరతం పట్టారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 14.5 ఓవర్లలో 148 పరుగులు జోడించారు. డు ప్లెసిస్ అవుటయ్యాక వచ్చిన దినేశ్ కార్తీక్ ఖాతా తెరువకుండానే పెవిలియన్ చేరగా... మ్యాక్స్‌వెల్ (3 బంతుల్లో 12 నాటౌట్; 2 సిక్స్‌లు), కోహ్లి బెంగళూరును లక్ష్యానికి చేర్చారు.
టాపార్డర్ విఫలం...
గత సీజన్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన ముంబై ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనూ నిరాశపరిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆశించిన ఆరంభం దక్కలేదు. పవర్‌ప్లే లోపే ముంబై మూడు కీలక వికెట్లను కోల్పోయింది. ఆదుకుంటాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ (16 బంతుల్లో 15; 1 ఫోర్) ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. దాంతో ముంబై 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.
ఈ దశలో తిలక్ వర్మ, నేహాల్ వధేరా కలిసి ముంబైను ఆదుకున్నారు. ముఖ్యంగా తిలక్ వర్మ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 32 బంతుల్లో తిలక్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఒకవైపు ముంబై వికెట్లను కోల్పోతున్నా మరోవైపు తిలక్ తన జోరు కొనసాగించడంతో ముంబై జట్టుకు గౌరవప్రద స్కోరు సాధ్యమైంది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లి, డు ప్లెసిస్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు ముంబై బౌలర్లపై తొలి బంతి నుంచే విరుచుకుపడ్డారు. దాంతో బెంగళూరు లక్ష్యం దిశగా సాగిపోయింది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో డు ప్లెసిస్.. గ్రీన్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్ వెంటవెంటనే అవుటైనా... కోహ్లి, మ్యాక్స్‌వెల్ మిగతా పనిని పూర్తి చేశారు.
అరుదైన ఘనత.. వార్నర్ సరసన కోహ్లి..
ముంబైతో మ్యాచ్‌లో అద్భుత అర్ధ శతకంతో ఆకట్టుకున్న విరాట్ కోహ్లి.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్ల జాబితాలో చేరాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్న ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ అరవై, పంజాబ్ కింగ్స్ సారథి శిఖర్ ధావన్ 49 ఫిఫ్టీలు సాధించాడు. ఆ తర్వాతి స్థానాల్లో నలభై ఐదు అర్ధ శతకాలతో కోహ్లి, ఆర్సీబీ లెజెండ్ ఏబీ డివిల్లియర్స్(43), ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ(41) ఉన్నారు.
RCB Vs MI Scorecard: స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్:
రోహిత్ శర్మ (సి) దినేశ్ కార్తీక్ (బి) ఆకాశ్‌దీప్ 1; ఇషాన్ కిషన్ (సి) హర్షల్ పటేల్ (బి) సిరాజ్ 10, గ్రీన్ (బి) టాప్లే 5; సూర్యకుమార్ యాదవ్ (సి) షహబాజ్ (బి) బ్రేస్‌వెల్ 15; తిలక్ వర్మ (నాటౌట్) 84; నేహల్ వధేరా (సి) కోహ్లి (బి) కరణ్ శర్మ 21; టిమ్ డేవిడ్ (బి) కరణ్ శర్మ 4; హృతిక్ షోకీన్ (సి) డు ప్లెసిస్ (బి) హర్షల్ పటేల్ 5; అర్షద్ ఖాన్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 171.
వికెట్ల పతనం: 1–11, 2–16, 3–20, 4–48, 5–98, 6–105, 7–123. బౌలింగ్: సిరాజ్ 4–0–21–1, రీస్ టాప్లే 2–0–14–1, ఆకాశ్‌దీప్ 3–0–29–1, హర్షల్ పటేల్ 4–0–43–1, కరణ్ శర్మ 4–0–32–2, బ్రేస్‌వెల్ 2–0–16–1, మ్యాక్స్‌వెల్ 1–0–16–0.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్:
విరాట్ కోహ్లి (నాటౌట్) 82; డు ప్లెసిస్ (సి) టిమ్ డేవిడ్ (బి) అర్షద్ ఖాన్ 73; దినేశ్ కార్తీక్ (సి) తిలక్ వర్మ (బి) గ్రీన్ 0; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (16.2 ఓవర్లలో రెండు వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–148, 2–149.
బౌలింగ్: బెహ్రెన్‌డార్ఫ్ 3–0–37–0, అర్షద్ ఖాన్ 2.2–0–28–1, జోఫ్రా ఆర్చర్ 4–0–33–0, పియూష్ చావ్లా 4–0–26–0, కామెరాన్ గ్రీన్ 2–0–30–1, హృతిక్ షోకీన్ 1–0–17–0.
చదవండి: IPL 2023: చేతులు కాలాక.. తాపత్రయపడితే ఏం లాభం! 13 కోట్లు.. ఒక్క సిక్సర్ కూడా లేదు!
Tilak Varma: 'ముంబైకి ఆడడం వారి అదృష్టం.. ఎస్‌ఆర్‌హెచ్‌లో ఉన్నా బాగుండు'
An electrifying atmosphere here at the M.Chinnaswamy Stadium 🏟️@RCBTweets fans, describe this opening partnership in one word! ✍️
— IndianPremierLeague (@IPL) April 2, 2023
Follow the match ▶️ https://t.co/ws391sFJwG#TATAIPL | #RCBvMI pic.twitter.com/xBvpPGdTfN
MAXIMUM x 2️⃣
— IndianPremierLeague (@IPL) April 2, 2023
The @RCBTweets opening duo is off to a flyer 💥
The FIFTY partnership is up between @faf1307 & @imVkohli and #RCB are 54/0!#TATAIPL | #RCBvMI pic.twitter.com/EpRoMyFGwJ
Comments
Please login to add a commentAdd a comment