#MI: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్‌.. మండిపడ్డ రోహిత్‌! | IPL 2024: Visibly Frustrated Rohit Has Intense Chat With Hardik After MI 6 Run Loss | Sakshi
Sakshi News home page

#HardikPandya: హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్‌.. మండిపడ్డ రోహిత్‌! పక్కనే అంబానీ..

Published Mon, Mar 25 2024 10:36 AM | Last Updated on Mon, Mar 25 2024 3:25 PM

IPL 2024: Visibly Frustrated Rohit Intense Chat With Hardik After MI 6 Run Loss - Sakshi

హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్‌.. మండిపడ్డ రోహిత్‌ (PC: BCCI/IPL)

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే పరాజయం చవిచూశాడు హార్దిక్‌ పాండ్యా. తాను గతంలో చాంపియన్‌గా నిలిపిన గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ముంబై ఓడిపోవడంతో చేదు అనుభవాన్ని మూటగట్టుకున్నాడు. అంతేకాకుండా ముంబై మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పట్ల వ్యవహరించిన తీరుతో విమర్శల పాలయ్యాడు.

పదే పదే రోహిత్‌ ఫీల్డింగ్‌ పొజిషన్‌ మార్చిన హార్దిక్‌.. ఆఖరికి తన నిర్ణయాల కారణంగా మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం.. తనను హత్తుకునేందుకు వచ్చిన హార్దిక్‌కు షాకిచ్చాడు రోహిత్‌ శర్మ. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. కాస్త గట్టిగానే క్లాస్‌ తీసుకున్నట్లు కనిపించింది.

ఆఖరి వరకు పోరాడిన మ్యాచ్‌లో పరాజయం ఎదురుకావడంతో రోహిత్‌ శర్మ.. మైదానంలోనే హార్దిక్‌ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఆ సమయంలో ముంబై ఇండియన్స్‌ యజమాని ఆకాశ్‌ అంబానీ సైతం అక్కడే ఉండటం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

కాగా ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌లో ఓడిపోవడం ఇది పన్నెండవసారి కావడం గమనార్హం. అంబానీల యాజమాన్యంలోని ఈ జట్టు 2012 తర్వాత మళ్లీ ఇంత వరకు ఒక్కసారి కూడా ఓపెనింగ్‌ మ్యాచ్‌లో గెలిచిన సందర్భాలు లేవు.

అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో శుబ్‌మన్‌ గిల్‌ సేన ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు పోరాడిన పాండ్యా బృందం తొమ్మిది వికెట్లు నష్టపోయి 162 పరుగుల వద్దే నిలిచిపోయింది.

ఫలితంగా ఆరు పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన గుజరాత్‌ టైటాన్స్‌ పదిహేడో ఎడిషన్‌లో శుభారంభం చేసింది. గుజరాత్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌(39 బంతుల్లో 45) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 29 బంతుల్లోనే 43 పరుగులు చేయగా.. హార్దిక్‌ పాండ్యా 4 బంతుల్లోనే 11 పరుగులు చేశాడు. కానీ వికెట్లేమీ తీయలేకపోయాడు.

చదవండి: IPL 2024 RR Vs LSG: అన్న ఇది నీవేనా.. మేము అస్స‌లు ఊహించ‌లేదు! వీడియో వైర‌ల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement