
PC: BCCI/IPL.com
సీఎస్‌కే ఘన విజయం..
చెపాక్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(65 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్(53) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో విఘ్నేష్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్, జాక్స్ తలా వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో దీపక్ చాహర్(28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు.
సీఎస్‌కే ఐదో వికెట్ డౌన్..
సీఎస్‌కే ఐదో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన సామ్ కుర్రాన్.. విల్ జాక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో రచిన్ రవీంద్ర(20), రవీంద్ర జడేజా(5) ఉన్నారు. 16 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 125/5
సీఎస్‌కే మూడో వికెట్ డౌన్.. దూబే ఔట్
శివమ్ దూబే రూపంలో సీఎస్‌కే మూడో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన దూబే.. విఘ్నేష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 11 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 100/3.
సీఎస్‌కే రెండో వికెట్ డౌన్.. గైక్వాడ్ ఔట్
రుతురాజ్ గైక్వాడ్ రూపంలో సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. 53 పరుగులు చేసిన రుతురాజ్ విఘ్నేష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 79/2.
6 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 62/1
6 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్(42), రచిన్ రవీంద్ర(20) ఉన్నారు.
తొలి వికెట్ డౌన్..
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి.. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లకు సీఎస్‌కే స్కోర్: 35/1. క్రీజులోకి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(18), రచిన్ రవీంద్ర(14) పరుగులతో ఉన్నారు.
రాణించిన సీఎస్‌కే బౌలర్లు..
చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖరిలో దీపక్ చాహర్(28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఖాలీల్ అహ్మద్ మూడు వికెట్లు సాధించాడు.
నూర్ ఆన్ ఫైర్..
ముంబై ఇండియన్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. ముంబై ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన నూర్ అహ్మద్ బౌలింగ్‌లో నాలుగో బంతికి రాబిన్ మింజ్ ఔట్ కాగా.. ఆఖరి బంతికి తిలక్ వర్మ(31) పెవిలియన్‌కు చేరాడు. 13 ఓవర్లకు ముంబై స్కోర్: 96/6
సూర్యకుమార్ ఔట్..
సూర్యకుమార్ యాదవ్ రూపంలో ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన సూర్యకుమార్.. నూర్
అహ్మద్ బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. ధోని అద్భుతమైన స్టంపింగ్‌తో మెరిశాడు. 12 ఓవర్లకు ముంబై స్కోర్: 92/4
ముంబై మూడో వికెట్ డౌన్..
విల్ జాక్స్ రూపంలో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన జాక్స్.. అశ్విన్ బౌలింగ్‌లో దూబేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి తిలక్ వర్మ వచ్చాడు. 6 ఓవర్లకు ముంబై స్కోర్: 52/3
ముంబై రెండో వికెట్ డౌన్
ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై రెండో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రికెల్టన్ ఖాలీల్ అహ్మద్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. 4 ఓవర్లకు ముంబై స్కోర్: 30/2
రోహిత్ శర్మ ఔట్..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఖాలీల్ ఆహ్మద్ బౌలింగ్‌లో దూబేకు క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. 2 ఓవర్లకు ముంబై స్కోర్: 17/1
ఐపీఎల్-2025లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఆంధ్ర ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజు ముంబై తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ రెగ్యూలర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరం కావడంతో సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తున్నాడు.
తుది జట్లు
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, ఖలీల్ అహ్మద్
Comments
Please login to add a commentAdd a comment