
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య తొలి టి20 మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాపై టీమిండియా బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఆరంభం నుంచి దూకుడు కనబరిచిన టీమిండియాకు సౌతాఫ్రికా ఆటగాళ్లు క్యాచ్‌లు జారవిడవడం కూడా కలిసొచ్చాయి. విషయంలోకి వెళితే.. సూపర్ ఫిప్టీతో మెరిసిన ఇషాన్ 53 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో ఇషాన్ డీప్ బ్యాక్‌వర్డ స్క్వేర్‌లెగ్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు. ఈ దశలో క్యాచ్ అందుకుందామని ఒకేసారి ముగ్గురు ఫీల్డర్లు పరిగెత్తుకొచ్చారు. కానీ ముగ్గురి మధ్య సమన్వయ లోపంతో ఎవరు క్యాచ్ అందుకోలేకపోయారు. అలా బతికిపోయిన ఇషాన్ కిషన్ ఆ తర్వాత తన ఇన్నింగ్స్‌కు మరో 23 పరుగులు జతచేసి 76 పరుగుల వద్ద ఔటయ్యాడు.
చదవండి: T20 Blast Tourney: 'క్యాచెస్ విన్ మ్యాచెస్' అని ఊరికే అనరు