జైశ్వాల్‌కు ఏమైంది.. ఇలా అయితే వరల్డ్‌కప్‌కు కష్టమే!? | Jaiswal's Gifts His Wicket With Careless Shot As MI's Maphaka | Sakshi
Sakshi News home page

IPL 2024: జైశ్వాల్‌కు ఏమైంది.. ఇలా అయితే వరల్డ్‌కప్‌కు కష్టమే!?

Published Mon, Apr 1 2024 10:35 PM | Last Updated on Tue, Apr 2 2024 10:18 AM

Jaiswals Gifts His Wicket With Careless Shot As MIs Maphaka - Sakshi

ఐపీఎల్‌-2024లో టీమిండియా యువ సంచలనం, రాజస్తాన్‌ రాయల్స్‌  ఓపెనర్‌ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన జైశ్వాల్‌.. ఇప్పుడు వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సైతం అదే తీరును కనబరిచాడు. జైశ్వాల్‌ ఈ మ్యాచ్‌లో​ కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

తొలి ఓవర్‌ వేసిన యువ పేసర్‌ మఫాక బౌలింగ్‌లో రెండు బౌండరీలు కొట్టి మంచి టచ్‌లో కన్పించిన యశస్వీ.. ఆఖరి బంతికి టిమ్‌ డేవిడ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడినే జైశ్వాల్‌ కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు.

అయితే టీ20 వరల్డ్‌కప్‌కు ముందు జైశ్వాల్‌ ఈ తరహా ప్రదర్శన చేయడం భారత జట్టు మెనెజ్‌మెంట్‌ను ఆందోళన కలిగిస్తోంది. రోహిత్‌ శర్మకు బ్యాక్‌ఆప్‌ ఓపెనర్‌గా జైశ్వాల్‌ను ఎంపిక చేసే ఆలోచనలో బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఉంది. ఈ నేపథ్యంలో జైశ్వాల్‌ తన ఫామ్‌ను తిరిగి పొందడం చాలా ముఖ్యం. ఏప్రిల్‌ చివరి వారంలో భారత జట్టును బీసీసీఐ సెలక్షన​్‌ కమిటీ ఎంపిక చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement