టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా కొన్నాళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్‌కు ముందు వెన్నునొప్పి తిరగబెట్టడంతో ఆటకు దూరమయ్యాడు. ఈమధ్యే న్యూజిలాండ్‌లో సర్జరీ చేయించుకున్నఈ యార్కర్ కింగ్ కోలుకుంటున్నాడు. సర్జరీ కారణంగా బుమ్రా ఈ ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీతో పాటు ఐపీఎల్‌కు దూరమయ్యాడు.
ఐపీఎల్ అనంతరం వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు ఆసియా కప్‌కు కూడా బుమ్రా దూరంగా ఉండనున్నాడు. అయితే అక్టోబర్-నవంబర్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్ వరకు బుమ్రా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో బుమ్రా తాజాగా శనివారం తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర పోస్టు షేర్ చేశాడు.
తాను మరికొన్ని రోజుల్లో బౌలింగ్ ప్రాక్టీస్‌కు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు ఇచ్చాడు. బుమ్రా తన షూ ఫొటోలను షేర్ చేస్తూ.. ''హలో ఫ్రెండ్.. మనం మళ్లీ కలుస్తాం'' అని క్యాప్షన్ జోడించాడు. బుమ్రా పోస్ట్ చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ''బుమ్రా వచ్చేస్తున్నాడు.. బూమ్ బూమ్ బుమ్రా ఈజ్ బ్యాక్'' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
టీమిండియా బౌలింగ్ దళానికి వెన్నుముక అయిన బుమ్రా గత ఏడాది సెప్టెంబర్ నుంచి క్రికెట్ ఆడలేదు. అయితే ఈ ఏడాది వరల్డ్ కప్‌లో బుమ్రా కీలకం కానున్నాడు. ఆలోపు అతను ఫిట్‌నెస్ సాధించాలని బీసీసీఐ కోరుకుంటోంది. స్వదేశంలో అక్టోబర్ – నవంబర్ మధ్య వరల్డ్ కప్ టోర్నీ ఉంటుంది. సొంత గడ్డపై రెండోసారి ట్రోఫీ అందుకోవాలని టీమిండియా భావిస్తోంది.
2011లో ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత జట్టు వరల్డ్ కప్ గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా టీమిండియా గెలవలేదు. దీంతో స్వదేశంలో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌ను రోహిత్ సేన ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది.
చదవండి: జడ్డూకు ఫుల్ డిమాండ్.. సీఎస్‌కే నుంచి బయటికి వస్తే?!
Comments
Please login to add a commentAdd a comment