కూతురును చూసి మురిసిపోతున్న స్టార్‌ క్రికెటర్‌‌ | Kane Williamson Blessed With Baby Girl Shares Adorable Picture Instagram | Sakshi
Sakshi News home page

కూతురును చూసి మురిసిపోతున్న స్టార్‌ క్రికెటర్‌‌

Published Wed, Dec 16 2020 2:27 PM | Last Updated on Wed, Dec 16 2020 2:59 PM

Kane Williamson Blessed With Baby Girl Shares Adorable Picture Instagram - Sakshi

వెల్లింగ్టన్‌ : న్యూజిలాండ్‌ స్టార్‌ క్రికెటర్‌ కేన్‌ విలియమ్‌సన్‌ బుధవారం తన అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పాడు. విషయానికి వస్తే.. కేన్‌ విలియమ్‌సన్‌ భార్య సారా రహీమ్‌ బుధవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా విలియమ్‌సన్‌ తన బిడ్డను ఎత్తుకొని ఉ‍న్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.  ' చిట్టితల్లి.. మా జీవితంలోకి.. అలాగే కొత్త ప్రపంచానికి స్వాగతం.. నీ రాక మా జీవితాల్లో కొత్త వెలుగులను నింపింది.. ' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. కాగా తండ్రిగా ప్రమోషన్‌ అందుకున్న కేన్‌ విలియమ్‌సన్‌కు టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌తో పాటు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి : 'క్షమించండి.. మళ్లీ రిపీట్‌ కానివ్వను')

2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కేన్‌ విలియమ్‌సన్‌ కివీస్‌ తరపున 151 వన్డేల్లో 6,173 పరుగులు.. 81 టెస్టుల్లో 6727 పరుగులు.. 60 టీ20ల్లో 1665 పరుగులు సాధించాడు. కాగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌ తర్వాత విలియమ్‌సన్‌ పెటర్నిటీ లీవ్స్‌పై భార్య దగ్గరకు వెళ్లాడు. విలియమ్‌సన్‌ మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో మెరవడమే గాక 251 పరుగులు చేసి కెరీర్‌లోనే బెస్ట్‌ స్కోరును నమోదు చేశాడు. విండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను కివీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే.(చదవండి : వైరల్‌ : ఒకరినొకరు తోసుకున్న టీమిండియా ఆటగాళ్లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement