
స్పెయిన్ లోని హుఎల్వా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ సత్తా చాటాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ లో కిదాంబి శ్రీకాంత్.. మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన డచ్ ఆటగాడు మార్క్ కల్జౌను 21-8, 21-7 తేడాతో ఓడించాడు. కేవలం 26 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ చిత్తు చేశాడు. దీంతో సెమీస్ కు చేరి పతకం ఖాయం చేసుకున్నాడు. కాగా అంతకుముందు మహిళల సింగిల్స్ క్వార్టర్స్ లో పీవీ సింధు.. తైపీ షట్లర్ తైజుయింగ్ చేతిలో 21-17, 21-13 తేడాతో ఓటమి చెందింది.
చదవండి: Rohit Sharma: యువ క్రికెటర్లకు రోహిత్ పాఠాలు.. ఫోటోలు వైరల్!