
టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌లో తొడ కండరాల గాయంతో బాధపడిన రాహుల్ ఆ తర్వాత లంకతో టి20 సిరీస్‌కు దూరమయ్యాడు. అంతేకాదు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమైన రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో ఫిట్‌నెస్ మెరుగుపరుచుకునే పనిలో పడ్డాడు. ఇక రాహుల్‌ను మనం డైరెక్ట్‌గా ఐపీఎల్‌లోనే చూస్తాం. పంజాబ్ కింగ్స్ నుంచి రిలీవ్ అయిన కేఎల్ రాహుల్ లక్నో సూపర్‌జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరి కొత్త జట్టును తన కెప్టెన్సీతో టైటిల్ అందిస్తాడో లేదో వేచిచూడాలి.
ఈ విషయం పక్కనబెడితే కేఎల్ రాహుల్ షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ ఫోటో కంటే వెనకాల ఉన్న బ్యాక్‌గ్రౌండ్ ఎక్కువగా హైలెట్ అయింది. దీనికి తోడూ చంద్రునిపై ఉన్నా అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీంతో రాహుల్‌ను టీజ్ చేస్తూ కొందరు ఆటపట్టించారు. ఇది చూసిన కేఎల్ రాహుల్ స్నేహితుడు దినేష్ కార్తిక్.. ''బాబీ నువ్వేమైనా యాపిల్ మ్యాప్స్ వాడుతున్నావా'' ఏంటి అంటూ కామెంట్ చేశాడు. అయితే దీనికంటే కేఎల్ రాహుల్ గర్ల్‌ఫ్రెండ్ అతియా శెట్టి సోదరుడు.. బాలీవుడ్ యాక్టర్ అహాన్ షెట్టి చేసిన కామెంట్ హైలెట్ అయింది. రాహుల్ కామెంట్‌ను ట్యాగ్ చేస్తూ.. ''బహుశా ఇది మార్స్ గ్రహంపై నుంచి దిగింది అనుకుంటా'' అంటూ పేర్కొన్నాడు.
చదవండి: Wriddiman Saha: 'సాహాను చూస్తే జాలేస్తోంది.. కానీ పంత్ ఉండడమే కరెక్ట్'
Novak Djokovic: నెంబర్ వన్ పాయే.. 15 ఏళ్ల బంధానికి ముగింపు పలికిన జొకోవిచ్
Comments
Please login to add a commentAdd a comment