
వన్డే ప్రపంచకప్-2023లో భారత జట్టు విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగుల తేడాతో టీమిండియా భారీ విజయాన్ని అందుకుంది. ఇది వరుసగా భారత్‌కు 8వ విజయం కావడం విశేషం.
కాగా ఈ మ్యాచ్‌లో 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల దాటికి 83 పరుగులకే కుప్పకూలింది. ఆదిలోనే డికాక్ వికెట్ కోల్పోయిన ప్రోటీస్ ఏ దశలోను తిరిగి కోలుకోలేకపోయింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 వికెట్లతో చెలరేగగా.. షమీ,కుల్దీప్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
మహ్మద్ సిరాజ్ కూడా ఓ వికెట్ సాధించారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మార్కో జానెసన్(14) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.
టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగాడు. తన 49వ సెంచరీని కోహ్లి సాధించాడు. తద్వారా అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ సమం చేశాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 121 బంతుల్లో 10 ఫోర్లతో కోహ్లి 101 పరుగులు చేశాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(77) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, జానెసన్, ఎంగిడీ, షమ్సీ తలా వికెట్ సాధించారు.
చదవండి: World cup 2023: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. 49వ సెంచరీ! సచిన్ వరల్డ్ రికార్డు సమం
Comments
Please login to add a commentAdd a comment