Ind Vs Aus: Mohammed Shami Dismisses David Warner With Unplayable Delivery - Sakshi
Sakshi News home page

IND Vs AUS: పాపం వార్నర్‌.. మళ్లీ షమీ చేతిలోనే! వీడియో వైరల్‌

Published Fri, Feb 17 2023 12:48 PM | Last Updated on Fri, Feb 17 2023 1:18 PM

Mohammed Shami dismisses David Warner with unplayable delivery - Sakshi

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో నిరాశపరిచిన వార్నర్‌.. ఇప్పుడు రెండో టెస్టులోనూ అదే తీరును కనబరిచాడు. ఢిల్లీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 44 బంతుల్లో 15 పరుగులు చేసి వార్నర్‌ పెవిలియన్‌కు చేరాడు. ఆది నుంచే భారత బౌలర్లు ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డ వార్నర్‌.. షమీ వేసిన ఓ అద్భుత బంతికి తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. 

షమీ సూపర్‌ డెలివరీ
షమీ ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే వార్నర్‌ను బౌన్సర్లతో భయ పెట్టాడు. షమీ దాటికి వార్నర్‌ను పరిశీలించేందుకు మూడు సార్లు ఫిజియో మైదానంలోకి రావడం గమనార్హం. ఆఖరికి ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌లో షమీ వేసిన ఓ ఔట్‌ స్వింగర్‌కు వార్నర్‌ పెవిలియన్‌కు చేరాడు. షమీ వేసిన బంతిని వార్నర్‌ ఢిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేయగా..బంతి స్వింగ్‌ అయ్యి ఎడ్జ్‌ తీసుకుని నేరుగా వికెట్‌ కీపర్‌ చేతికి వెళ్లింది.

ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. కాగా నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో కూడా ఓ అద్భుతమైన డెలివరితో వార్నర్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఇక​ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లంచ్‌ విరామానికి ఆస్ట్రేలియా 3 వికెట్లు ‍కోల్పోయి 94 పరుగులు చేసింది.
చదవండిIND vs AUS: పుజారా అరుదైన రికార్డు.. ఘనంగా సత్కరించిన బీసీసీఐ! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement