
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ ప్రస్తుతం మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ తర్వాత షమీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా షమీ దూరమయ్యాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ప్రకటించిన జట్టులో షమీకి చోటు దక్కలేదు. అయితే షమీ త్వరలోనే సర్జరీ కోసం జర్మనీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
వరుడి గెటప్‌లో షమీ..
ఇక ఇది ఇలా ఉండగా.. షమీ కొత్త లూక్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లికొడుకు ముస్తాబులో, తలపాగా ధరించి మెడలో దండతో ఉన్న మూడు ఫొటోలను షమీ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. ఫోటోలు చూసిన అభిమానులు ఏంటి షమీ సర్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.
కాగా షమీ తన భార్య హసీన్ జహాన్‌తో ప్రస్తుతం దూరంగా ఉంటున్నాడు. షమీ తనతో క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని, గృహహింస సహా పలు ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో వారిద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో షమీ కొత్త లూక్‌లో ఇలా దర్శనివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment