MS Dhoni Surprise Appearance In Rishabh Pant Instagram Live With Rohit And SKY, Video Viral - Sakshi
Sakshi News home page

Pant Instagram Live Video: పంత్‌ మాటను లెక్కచేయని ధోని.. నవ్వుకున్న రోహిత్‌, సూర్యకుమార్‌

Published Wed, Jul 27 2022 9:51 AM | Last Updated on Wed, Jul 27 2022 10:58 AM

MS Dhoni Surprised Rishabh Pant Instagram Live Session Rohit-SuryaKumar - Sakshi

ఇంగ్లండ్‌తో సిరీస్‌ అనంతరం టీమిండియా సీనియర్‌ క్రికెటర్లు విశ్రాంతిలో ఉండగా.. ధావన్‌ నాయకత్వంలో మరో జట్టు విండీస్‌ పర్యటనకు వెళ్లింది. వన్డే సిరీస్‌లో ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉన్న భారత్‌ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఆ తర్వాత ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో రోహిత్‌ సహా సీనియర్లంతా జట్టుతో కలవనున్నారు. ఈ సంగతి పక్కనబెడితే.. రిషబ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రోహిత్‌ శర్మలు ఇన్‌స్టా‍గ్రామ్‌లో లైవ్‌ చాట్‌లో పాల్గొన్నారు.

ఈ ముగ్గురు ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు. వీరి లైవ్‌ సెషన్‌కు ధోని ఎంటరయ్యి సర్‌ప్రైజ్‌ చేశాడు. వీడియో ధోని భార్య సాక్షి సింగ్‌ కనిపించగా.. ఆమె తన ముఖాన్ని దాచడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత కెమెరా ధోని అంకుల్‌వైపు తిప్పారు. చివరగా ధోనివైపు కెమెరా రాగానే రోహిత్‌, సూర్యకుమార్‌, పంత్‌లు హాయ్‌ చెప్పారు. ధోని కూడా హాయ్‌ చెప్పి కెమెరాకు చేతులు అడ్డుపెట్టాడు.

ఇంతలో పంత్‌.. ''మహీ బాయ్‌.. మేం లైవ్‌ కాల్‌ ఉన్నాం.. కాసేపు మాతో గడుపు'' అని పేర్కొన్నాడు. దీనికి ధోని సారీ అంత టైమ్‌ లేదు.. అంటూ కాల్‌ కట్‌ చేసేశాడు. దీంతో పంత్‌ మాట లెక్కచేయకుండా ధోని కాల్‌ కట్‌ చేయడంతో రోహిత్‌, సూర్య కుమార్‌లు నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక విండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ఆడడానికి రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, దినేశ్‌ కార్తిక్‌, భువనేశ్వర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ వెస్టిండీస్‌కు చేరుకున్నారు. కాగా ధోని తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం హాలిడే మూడ్‌లో ఉన్నాడు. వెకేషన్‌లో భాగంగా ధోని.. భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి లండన్‌లో ఉన్నాడు. 

చదవండి: PAK vs SL: లంక క్రికెటర్‌తో పవాద్‌ ఆలం వైరం.. ఇలా కూడా గొడవ పడొచ్చా!

Yuvraj Singh: 'ఎవరీ బుడ్డోడు'.. కన్న కొడుకును గుర్తుపట్టలేకపోయిన యువీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement