Wrestlers Protest: Wrestlers Did Not Get Any Assurance From Amit Shah On Brij Bhushan Arrest - Sakshi
Sakshi News home page

బ్రిజ్‌భూషణ్‌ అరెస్ట్‌కు రెజ్లర్ల డిమాండ్‌.. లభించని అమిత్ షా హామీ

Published Mon, Jun 5 2023 2:02 PM | Last Updated on Mon, Jun 5 2023 3:03 PM

Protesting Wrestlers Did Not Get Assurance Of Amit Shah - Sakshi

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్ట్‌ చేయాలనే ప్రధాన డిమాండ్‌పై చాలాకాలంగా ఢిల్లీ వీధుల్లో నిరసనలు తెలియజేస్తున్న రెజ్లర్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను ఇవాళ కలిసారు. ఈ సందర్భంగా వారు అమిత్‌ షాతో తమ గోడు వెల్లబుచ్చుకున్నారు.

బ్రిజ్‌భూషణ్ తమను లైంగికంగా వేధించాడని వారు హోం మంత్రికి వివరించారు. బ్రిజ్‌భూషణ్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని అమిత్‌ షాకు విన్నవించుకున్నారు. అయితే బ్రిజ్‌భూషణ్ అరెస్ట్‌పై రెజ్లర్లకు అమిత్‌ షా నుంచి ఎలాంటి హామీ రాలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అమిత్ షా రెజ్లర్లకు చెప్పినట్లు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement