ఈ నెల 17 నుంచి ప్రారంభంకానున్న దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీట్రోఫీ 2022కి సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చింది. టోర్నీలో పాల్గొనే జట్టు సభ్యుల సంఖ్య 30కి మించకూడని బీసీసీఐ ప్రకటించింది. ఇందులో ఆటగాళ్ల సంఖ్య కనీసం 20 ఉండాలని, అదనంగా ఇద్దరు కోవిడ్ రిజర్వ్ ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఆయా జట్లకు ఉంటుందని, మిగిలిన 10 మంది సహాయక సిబ్బంది ఉండాలని బీసీసీఐ పేర్కొంది.
ఈ రూల్‌ను అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు తప్పక పాటించాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రంజీల్లో ఆడబోయే టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుకు సంబంధించి కూడా బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. రహానే, పుజారాల్లా టీమిండియాకు ఆడిన ఆటగాళ్లకు రెగ్యులర్ ఆటగాళ్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిసైడ్ చేసింది. రంజీ తుది జట్టులోని 11 మందికి 2.4 లక్షలు, మిగతా 9 మందికి 1.2 లక్షల చొప్పున ఇచ్చేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కాగా, టోర్నీలో భాగంగా మొత్తం 38 జట్లు 9 గ్రూపులుగా విభంజించబడి, 62 రోజుల పాటు దేశంలోని 9 ప్రధాన నగరాల్లో(అహ్మదాబాద్, కోల్‌కతా, రాజ్‌కోట్, ఢిల్లీ, గౌహతి, కటక్, త్రివేండ్రం, చెన్నై, హర్యానా), 64 మ్యాచ్‌లను నిర్వహించతలపెట్టినట్లు బీసీసీఐ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది రంజీ సీజన్ జనవరి 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. దేశంలో కరోనా విజృంభణ కారణంగా టోర్నీని కొన్ని రోజుల పాటు వాయిదా వేశారు.
చదవండి: దేనికైనా రెడీ.. అవసరమైతే అందుకు కూడా..: సూర్యకుమార్ యాదవ్
Comments
Please login to add a commentAdd a comment