team India senior players
-
‘జాన్సెన్‌తో ప్రమాదం పొంచి ఉంది’
(గౌతమ్ గంభీర్) : ఐపీఎల్లో కేకేఆర్ తరఫున ఆడిన సమయంలో షమీ తలపై జుట్టు ఎక్కువగా ఉండేది. సీనియర్లు సరదాగా గడిపే సమయంలోనూ అతను నిశ్శబ్దంగా ఉంటూ తన పనేంటో తాను చేసుకుపోయేవాడు. ఎక్కడో అమ్రోహాలాంటి చిన్న పట్టణంనుంచి కెరీర్ కోసం షమీ బయటకు వచ్చాడు. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ ప్లేయర్ స్టోక్స్‌కు అతను వేసిన స్పెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చక్కటి గుడ్ లెంగ్త్ బంతులతో అతను కట్టిపడేయగా, స్టోక్స్ చిన్న క్లబ్ క్రికెటర్లా కనిపించాడు. పది బంతులు ఆడినా అతను పరుగు తీయలేకపోయాడు. షమీ తర్వాతి మ్యాచ్‌లో అదే జోరును కొనసాగించాడు. ఇప్పుడు తన సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌కు అతను తిరిగొస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో హోరాహోరీ పోరు ఖాయం. బౌన్స్ ఉండే ఇక్కడి పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలిస్తుంది. భవిష్యత్తులో గొప్ప ఆల్‌రౌండర్ కాగల సామర్థ్యం మార్కో జాన్సెన్కు ఉంది. తన బౌలింగ్‌తో అతను కోహ్లి, రోహిత్‌లను కూడా ఇబ్బంది పెట్టగలడు. రబడ, ఎన్గిడిలాంటి బౌలర్లతో పాటు అద్భుత ఫీల్డింగ్ దక్షిణాఫ్రికా సొంతం. జట్టు బ్యాటింగ్‌ను డి కాక్ ముందుండి నడిపిస్తున్నాడు. నా లక్నో జట్టు సహచరుడైన డి కాక్ ప్రతిభ గురించి ఏనాడూ సందేహం లేదు. -
శ్రీలంకతో టీమిండియా తొలిపోరు.. కోహ్లి మెరిసేనా..?
భారత గడ్డపై శ్రీలంక జట్టు ఇప్పటి వరకు 20 టెస్టులు ఆడితే 11 ఓడిపోయింది...9 ‘డ్రా’ కాగా, ఒక్కటంటే ఒక్కటీ గెలవలేకపోయింది! ఈ రికార్డు చూస్తే శ్రీలంకతో స్వదేశంలో భారత్ టెస్టు మ్యాచ్ అమితాసక్తి రేపే అవకాశం లేదు. కానీ ఈ సిరీస్‌కు టీమిండియా దృష్టిలో ప్రత్యేకత ఉంది. భారత టెస్టు జట్టు 35వ కెప్టెన్‌గా రోహిత్ శర్మ తొలిసారి మైదానంలో దిగుతుండగా...ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడైన విరాట్ కోహ్లి తన 100వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు. పైగా 2012 తర్వాత పుజారా, రహానే ఇద్దరూ లేకుండా తొలి సారి టెస్టు ఆడబోతున్న భారత్ యువ బ్యాటర్లతో మార్పుకు శ్రీకారం చుట్టింది. మరో వైపు ప్రస్తుతం డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో ఉన్న లంక మెరుగైన ప్రదర్శనతో ఏమాత్రం పోటీనిస్తుందనేది ఆసక్తికరం. మొహాలి: కొంత విరామం తర్వాత భారత్‌లో టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇక్కడి పీసీఏ స్టేడియంలో నేటినుంచి జరిగే తొలి టెస్టులో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించే క్రమంలో భారత్ 9 టెస్టులు ఆడాల్సి ఉండగా...అందులో ఇది మొదటిది. వరుస విజయాలు సాధిస్తే గానీ ఫైనల్ చేరే అవకాశం లేని టీమిండియా ఈ క్రమంలో లంకపై విజయంతో శుభారంభం చేయాలని కోరుకుంటోంది. వన్డేలు, టి20ల్లో కెప్టెన్‌గా ఇప్పటికే రుజువు చేసుకున్న రోహిత్ టెస్టు నాయకత్వ సామర్థ్యానికి కూడా ఈ సిరీస్ పరీక్షగా నిలవనుంది. అవకాశం ఎవరికో? చివరిసారిగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో బరిలోకి దిగిన జట్టుతో పోలిస్తే భారత తుది జట్టులో పలు మార్పులు ఖాయమయ్యాయి. రోహిత్‌తో పాటు మయాంక్ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నాలుగో స్థానంలో ఎప్పటిలాగే ఆడనున్న కోహ్లి తన కెరీర్లో చిరస్మరణీయ మ్యాచ్‌లో సత్తా చాటాల్సి ఉంది. 100 టెస్టులు ఆడిన 71వ క్రికెటర్‌గా నిలవనున్న మాజీ కెప్టెన్ 71వ అంతర్జాతీయ సెంచరీ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. పంత్ తనదైన దూకుడు కనబర్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. స్పిన్ బౌలింగ్‌లో అశ్విన్, జడేజా జంట మరోసారి ప్రత్యర్థిని ముప్పుతిప్పులు పెట్టేందుకు సిద్ధమైంది. మూడో స్పిన్నర్‌ను ఆడించే అవకాశం ఉంటే బ్యాటింగ్ కూడా చేయగల జయంత్ యాదవ్‌కు తొలి ప్రాధాన్యత దక్కవచ్చు. పేస్ విభాగంలో బుమ్రాకు తోడుగా రెండో పేసర్‌గా సీనియర్ షమీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు పేసర్లకే పరిమితమైతే సిరాజ్‌కు చోటు కష్టమే. అన్నింటికి మించి పుజారా, రహానే స్థానాలను భర్తీ చేసే విషయంలోనే పోటీ నెలకొని ఉంది. శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, శుబ్‌మన్ గిల్‌లలో ఇద్దరికే చాన్స్ ఉండటంతో ఎవరిని పక్కన పెడతారో చూడాలి. మొత్తంగా ప్రత్యర్థితో పోలిస్తే భారత్ అన్ని రకాలుగా పటిష్టంగా ఉంది. కరుణరత్నేపైనే భారం! శ్రీలంక జట్టులో ఎక్కువ మంది జూనియర్లే ఉన్నారు. వీరికి భారత్‌లో ఆడిన అనుభవం దాదాపుగా లేదు. సీనియర్ మాథ్యూస్ కొంత వరకు బాధ్యతలు తీసుకోనుండగా ఓపెనర్, కెప్టెన్ దిముత్ కరుణరత్నే ప్రదర్శనే కీలకం కానుంది. గత రెండేళ్లుగా కరుణరత్నే అద్భుత ప్రదర్శనతో ప్రపంచంలో అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మిడిలార్డర్లో ధనంజయ డిసిల్వ కీలకం. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎంబుల్డెనియాపై కూడా లంక ఆశలు పెట్టుకుంది. భారత గడ్డపై మురళీధరన్లాంటి దిగ్గజం కూడా 45 సగటు నమోదు చేశాడంటే మనపై స్పిన్నర్ ప్రభావం చూపించడం ఎంత కష్టమో అర్థమవుతుంది. మీడియా సమావేశాన్ని బట్టి చూస్తే లంక ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగే ఆలోచనలో కనిపిస్తోంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), మయాంక్, విహారి, కోహ్లి, శ్రేయస్, పంత్, జడేజా, అశ్విన్, జయంత్, షమీ, బుమ్రా. శ్రీలంక: కరుణరత్నే (కెప్టెన్), తిరిమన్నె, నిసాంక, మాథ్యూస్, దనంజయ, చండిమాల్, డిక్వెలా, లక్మల్, ఎంబుల్డెనియా, జయవిక్రమ, కుమార పిచ్, వాతావరణం ఆరంభంలో బ్యాటింగ్‌కు అనుకూలించినా మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లకు బాగా స్పందిస్తుంది. సాధారణ వాతావరణం, వర్ష సూచన లేదు. ‘నిజాయితీగా చెప్పాలంటే వంద టెస్టులు ఆడతానని ఎప్పుడూ ఊహించలేదు. ఇదో సుదీర్ఘ ప్రయాణం. వంద టెస్టుల మైలురాయిని చేరుకునే క్రమంలో ఎంతో క్రికెట్ ఆడాను, ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు దాటాను. ఇక్కడి వరకు రాగలగడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. నా ఫిట్నెస్ కోసం చాలా శ్రమించాను. దేవుడు నాకు అండగా నిలిచాడు. నాకు, నా కుటుంబ సభ్యులు, కోచ్‌కు ఇది చాలా గర్వపడే క్షణం.ఆసీస్ గడ్డపై సాధించిన నా తొలి సెంచరీని ఎప్పటికీ మరచిపోలేను. టెస్టు క్రికెట్ కోసం నేను నా సర్వం వెచ్చించాను. దేశం తరఫున ఆడటమే అన్నింటికంటే పెద్ద ప్రేరణ కాబట్టి మరో ఆలోచన అవసరం లేదు. వందో టెస్టు సందర్భంగా భావోద్వేగానికి గురి కావడం లేదని చెబితే అది అబద్ధమాడుతున్నట్లే’ – విరాట్ కోహ్లి (తన 100వ టెస్టు సందర్భంగా) ‘ఒక టెస్టు జట్టుగా ప్రస్తుతం మేం మంచి స్థానంలో ఉన్నామంటే ఆ ఘనత కోహ్లిదే. ఇన్నేళ్లుగా అతను జట్టును తీర్చిదిద్దిన తీరు అద్భుతం. అతను ఎక్కడ ముగించాడో నేను అక్కడినుంచే కొనసాగించబోతున్నాను. తొలి టెస్టునుంచి 100వ టెస్టు వరకు విరాట్ ప్రయాణం చాలా గొప్పగా సాగింది. ఈ ఫార్మాట్లో తాను గొప్పగా ఆడుతూనే జట్టును కూడా ముందుకు తీసుకెళ్లాడు. కోహ్లికి నా అభినందనలు. ఈ టెస్టును అతని కోసం మరింత ప్రత్యేకంగా మార్చాలని భావిస్తున్నాం. 2013లో జొహన్నెస్‌బర్గ్‌లో ప్రతికూల పరిస్థితుల మధ్య పదునైన బౌలింగ్‌ను ఎదుర్కొని చేసిన సెంచరీ నా దృష్టిలో విరాట్ అత్యుత్తమ ప్రదర్శన’ – రోహిత్ శర్మ, భారత కెప్టెన్ -
క్రికెటర్ల సంఖ్యను ప్రకటించిన బీసీసీఐ.. జట్టులో కనీసం..!
ఈ నెల 17 నుంచి ప్రారంభంకానున్న దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీట్రోఫీ 2022కి సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. టోర్నీలో పాల్గొనే జట్టు సభ్యుల సంఖ్య 30కి మించకూడని బీసీసీఐ ప్రకటించింది. ఇందులో ఆటగాళ్ల సంఖ్య కనీసం 20 ఉండాలని, అదనంగా ఇద్దరు కోవిడ్ రిజర్వ్ ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఆయా జట్లకు ఉంటుందని, మిగిలిన 10 మంది సహాయక సిబ్బంది ఉండాలని బీసీసీఐ పేర్కొంది. ఈ రూల్‌ను అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లు తప్పక పాటించాలని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రంజీల్లో ఆడబోయే టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుకు సంబంధించి కూడా బీసీసీఐ ఓ ప్రకటన చేసింది. రహానే, పుజారాల్లా టీమిండియాకు ఆడిన ఆటగాళ్లకు రెగ్యులర్ ఆటగాళ్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిసైడ్ చేసింది. రంజీ తుది జట్టులోని 11 మందికి 2.4 లక్షలు, మిగతా 9 మందికి 1.2 లక్షల చొప్పున ఇచ్చేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, టోర్నీలో భాగంగా మొత్తం 38 జట్లు 9 గ్రూపులుగా విభంజించబడి, 62 రోజుల పాటు దేశంలోని 9 ప్రధాన నగరాల్లో(అహ్మదాబాద్, కోల్‌కతా, రాజ్‌కోట్, ఢిల్లీ, గౌహతి, కటక్, త్రివేండ్రం, చెన్నై, హర్యానా), 64 మ్యాచ్‌లను నిర్వహించతలపెట్టినట్లు బీసీసీఐ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది రంజీ సీజన్ జనవరి 13 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. దేశంలో కరోనా విజృంభణ కారణంగా టోర్నీని కొన్ని రోజుల పాటు వాయిదా వేశారు. చదవండి: దేనికైనా రెడీ.. అవసరమైతే అందుకు కూడా..: సూర్యకుమార్ యాదవ్ -
సీనియర్లకు రెస్ట్.. టీమిండియాలోకి ఐపీఎల్ హీరోస్..!
Senior Team India Cricketers Could Be Rested For New Zealand T20I Series: టీ20 ప్రపంచకప్ ముగిసిన వారం వ్యవధిలో ప్రారంభమయ్యే న్యూజిలాండ్ సిరీస్ కోసం టీమిండియాలో భారీ మార్పులు జరిగే ఆస్కారముందని బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. నవంబర్ 17, 19, 21 తేదీల్లో జరిగే ఈ టీ20 సిరీస్ నేపథ్యంలో సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు విశ్రాంతి కల్పించి ఐపీఎల్లో రాణించిన వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, రుతురాజ్ గైక్వాడ్, ఆవేశ్ ఖాన్లకు అవకాశం కల్పించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. జూన్‌లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి టీమిండియా సీనియర్ సభ్యులు వరుసగా బయోబబుల్‌లో ఉండడమే ఈ మార్పులు చేర్పులకు కారణమని తెలుస్తోంది. డిసెంబర్లో దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో సీనియర్లకు విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ సైతం సెలెక్షన్ కమిటీకి సిఫార్సు చేసినట్లు సమాచారం. మరోవైపు టీ20 ప్రపంచకప్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న రవిశాస్త్రి స్థానంలో తాత్కాలిక కోచ్‌గా ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌ను నియమించేందుకు కూడా బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇదంతా కార్యరూపం దాల్చితే న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో ద్రవిడ్ ఆధ్వర్యంలో ఐపీఎల్ సూపర్ హీరోస్ అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఖాయమేనని విశ్లేషకుల అంచనా. ఇదిలా ఉంటే, భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సిరీస్‌కు భారత్ ఆతిధ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇరు జట్లు 3 టీ20లు, 2 టెస్ట్ మ్యాచ్‌లలో తలపడనున్నాయి. చదవండి: టీ20 క్రికెట్‌కు అశ్విన్ అనర్హుడు.. నేనైతే అతన్ని జట్టులోకి తీసుకోను -
‘రాహుల్ ఔటైన తర్వాత అదే అనుకున్నాం’
బెంగళూరు: మూడు వన్డేల సిరీస్ విజేతను నిర్ణయించే మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యాన్ని కోహ్లి సేన 47.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్య ఛేదనలో టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(119, 128 బంతుల్లో 8ఫోర్లు, 6 సిక్సర్లు) విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ తర్వాత అవార్డుల కార్యక్రమంలో రోహిత్ మాట్లాడుతూ.. ‘ ఆస్ట్రేలియా భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాం. 290 పరుగులలోపే ఆసీస్‌ను కట్టడి చేయాలనే మా ప్రణాళిక సక్సెస్ అయ్యింది. ఇది చాలా కీలకమైన మ్యాచ్. సిరీస్‌ను డిసైడ్ చేసే మ్యాచ్. రాహుల్‌తో కలిసి మంచి ఇన్నింగ్స్‌ను నిర్మించడానికి యత్నించా. (ఇక్కడ చదవండి: కంగారెత్తించాం) రాహుల్ ఔటైన తర్వాత కోహ్లి కలిసి భారీ భాగస్వామ్యం సాధించాలని మేమిద్దరం అనుకున్నాం. ఆ సమయంలో భారీ భాగస్వామ్యాన్ని నిర్మించడానికి కోహ్లి కంటే మంచి బ్యాట్స్‌మన్ మరొకరు ఉండరు. అందుచేత బాధ్యతాయుతంగా ఆడాం. ఒకరు డిఫెన్స్, మరొకరు ఎఫెన్స్ అని నిర్ణయించుకున్నాం. నేనే నా సహజ శైలిలో ఆడతానని కోహ్లికి చెప్పా. రిస్క్ చేస్తానని చెప్పా. ఆసీస్ టాప్-3 బౌలర్ల నుంచి మాకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయినా దాని అధిగమించాం. దాంతోనే వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాం’ అని రోహిత్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్-కోహ్లిలు 137 పరుగుల భాగస్వామ్యం సాధించడంతో భారత్ విజయం సునాయాసమైంది. -
ఐపీఎల్-9 వివాదంలో మిస్టరీ
ఐపీఎల్-9వ సీజన్‌నూ వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ సీజన్ నుంచి ప్రఖ్యాత కామెంటేటర్ హర్షా భోగ్లేను ఉన్నఫళంగా తొలగించడానికి కారణమేంటన్నది మిస్టరీగా మారింది. దీనికి కొందరు టీమిండియా సీనియర్ క్రికెటర్లే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. భోగ్లేకు వ్యతిరేకంగా వారు బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. భోగ్లే కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కాగా తనను ఎందుకు తొలగించారో కారణం తెలియదని భోగ్లే చెబుతున్నాడు. బీసీసీఐ కూడా కారణం వెల్లడించలేదు. ఐపీఎల్ టోర్నీకి రెండ్రోజుల ముందు వరకు ఆయన కామెంటరీ ప్యానెల్లో ఉన్నాడు. ఫ్లైట్ టికెట్లు కూడా ఒకే అయ్యాయి. ఇంతలోనే తన సేవలు అవసరం లేదని ఈ మెయిల్ పంపినట్టు భోగ్లే వాపోయాడు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఎందుకు తొలగించారన్నది చర్చనీయాంశంగా మారింది. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. టి-20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత టీమిండియా సీనియర్ క్రికెటర్లు భోగ్లేపై బోర్డుకు ఫిర్యాదు చేసి ఉంటారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ ధోనీతో పాటు సురేష్ రైనా, అశ్విన్ మీడియా సమావేశాల్లో దురుసుగా మాట్లాడటాన్ని నెటిజన్లు ప్రస్తావించారు. భోగ్లే ఇటీవల విదర్భ క్రికెట్ సంఘం గురించి పరుష వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. భోగ్లే పేరును ప్రస్తావించకుండా ఇటీవల విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో భోగ్లే ఉద్వాసనకు కారణమేంటన్నది మిస్టరీగా మారింది.