RCB Fans Crazy Prayers For God-Enter Playoffs Winning SRH Match Viral - Sakshi
Sakshi News home page

RCB ప్లేఆఫ్‌ కోసం పూజలు.. పిచ్చి పీక్స్‌ అంటే ఇదే!

Published Thu, May 18 2023 6:24 PM | Last Updated on Thu, May 18 2023 8:35 PM

RCB Fans Crazy Prayers For God-Enter Play-offs Winning SRH Match Viral - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ టైటిల్‌ కొట్టేందుకు అన్ని అర్హతలు ఉన్న జట్టు ఆర్‌సీబీ. ప్రతీ సీజన్‌లో ఫెవరెట్‌గా బరిలోకి దిగుతూ అంచనాలకు మించి రాణిస్తూ ఆఖర్లో చతికిలపడడం జట్టుకు అలవాటైపోయింది. గత మూడు సీజన్లుగా అద్బుత ఆటతీరుతో అలరించినప్పటికి ప్లేఆఫ్స్‌ వరకే పరిమితమైంది. తాజాగా ఈ సీజన్‌లోనూ ఆర్‌సీబీకి ప్లేఆఫ్‌ రేసులో ఉంది. ఇప్పటికే గుజరాత్‌ టైటాన్స్‌ ప్లేఆఫ్‌ రసుకు అర్హత సాధించగా.. మిగిలిన మూడు స్థానాలకు ఆరు జట్లు పోటీ పడుతున్నాయి.

ప్రస్తుతం ఆర్‌సీబీ 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఆరు ఓటములతో 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే ఆర్‌సీబీ ఎలాంటి అడ్డంకులు లేకుండా 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తోంది.

అందుకే ఇవాళ ఎస్‌ఆర్‌హెచ్‌తో జరగనున్న మ్యాచ్‌ ఆర్‌సీబీకి కీలకం కానుంది. దీంతో ఆర్‌సీబీ అభిమానులు తమ జట్టు ఎలాగైనా ప్లేఆఫ్‌కు చేరాలంటూ పూజలు చేయడం ఆసక్తి కలిగించింది. బెంగళూరుకు చెందిన కొందరు ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ RCB Get Into Play-offs.. E sala Cup Namde అంటూ దేవుడికి హోమాలు, పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన కొంతమంది క్రికెట్‌ ఫ్యాన్స్‌.. పిచ్చి పీక్స్‌కు చేరడం అంటే ఇదే.. అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: 'కెరీర్‌ను తలకిందులు చేసింది.. మళ్లీ నడుస్తాననుకోలేదు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement