IPL 2022: Returning Suryakumar Yadav Boosts Mumbai Indians Against Rajasthan Royals - Sakshi
Sakshi News home page

IPL 2022: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్‌.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు!

Published Fri, Apr 1 2022 12:48 PM | Last Updated on Fri, Apr 1 2022 2:49 PM

Returning Suryakumar Yadav Boosts Mumbai Indians Against  Rajasthan Royals - Sakshi

Courtesy: IPL Twitter

IPL 2022: ఐపీఎల్‌-2022లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓటమి చెందిన ముంబై ఇండియన్స్‌ తమ తదుపరి మ్యాచ్‌కు సిద్దమవుతోంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియం‍ వేదికగా శనివారం(ఏప్రిల్‌2)న రాజస్తాన్‌ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు గుడ్‌ న్యూస్‌ అందింది. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్ యాదవ్‌.. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు.

గాయం నుంచి కోలుకున్న అతడు తొలి మ్యాచ్‌కు జట్టులో చేరినప్పటికీ.. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే సూర్య ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు జట్టులోకి రావడం ఖాయం‍గా మారింది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఓటమి చెందింది.

ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), అన్మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ బుద్ధి, రమణదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్, బాసిల్ థంపి, హృతిక్ షోకీన్, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్, జోఫ్రా ఆర్చర్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, టైమల్ మిల్స్, అర్షద్ ఖాన్, డేనియల్ సామ్స్, డెవాల్డ్ బ్రెవిస్, ఫాబియన్ అలెన్, కీరన్ పొలార్డ్, సంజయ్ యాదవ్, ఆర్యన్ జుయల్ మరియు ఇషాన్ కిషన్.

చదవండి: IPL 2022: భారీ సిక్సర్‌ బాదిన సీఎస్కే బ్యాటర్‌.. చూస్తే వావ్‌ అనాల్సిందే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement