Asia Cup 2023- KL Rahul- Shreyas Iyer To Return: ఆసియా కప్-2023 నాటికి టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గాయాల బారిన పడి శస్త్ర చికిత్సలు చేయించుకున్న వీరిద్దరు.. జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నారు.
క్రమక్రమంగా కోలుకున్న అయ్యర్, రాహుల్ ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ చెమటోడుస్తున్నారు. మెగా ఈవెంట్ ప్రారంభమయ్యేసరికి పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్‌సీఏలో ఉన్న మరో స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ వీరిద్దరి గురించి వీడియో రూపంలో మేజర్ అప్‌డేట్ ఇచ్చాడు.
శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసినట్లు దీపాన్షు ఠాకూర్ ట్వీట్ చేశాడు. టీమిండియా అభిమానులను అలరిస్తున్న ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఏడాది టీమిండియా ఆసియా వన్డే కప్, వన్డే ప్రపంచకప్ రూపంలో కీలక టోర్నీలు ఆడనుంది.
అదే సమస్య.. అయ్యర్ ఉన్నాడనుకుంటే
అయితే, శ్రేయస్ అయ్యర్ గాయపడి జట్టుకు చాన్నాళ్లుగా దూరమైన నేపథ్యంలో మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానం సమస్యగా మారింది. మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత ఆ ప్లేస్‌లో అయ్యర్ ఇప్పుడిపుడే తానే కరెక్ట్ అని నిరూపించుకుంటుండగా.. వెన్నునొప్పి రూపంలో సమస్య వెంటాడుతోంది.
అభిమానులకు పండగే
మెగా ఈవెంట్లకు కూడా అతడు అందుబాటులోకి రానట్లయితే యువ సంచలనం తిలక్ వర్మను అయ్యర్ స్థానంలో ఆడించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్న వీడియో బయటకు రావడంతో అతడి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. పనిలో పనిగా పంత్‌కు థాంక్స్ చెబుతున్నారు.
కాగా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గతేడాది డిసెంబరులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ముంబైలో మేజర్ సర్జరీల అనంతరం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్న ఈ ఉత్తరాఖండ్ ఆటగాడు.. గత కొంతకాలంగా అక్కడే ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 30 నుంచి శ్రీలంక, పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ టోర్నీ ఆరంభం కానుంది.
చదవండి: అసలు గెలవాలన్న కసి లేనేలేదు.. కెప్టెన్ వెర్రిమొహం వేస్తున్నాడు! ఇకనైనా..
🚨 KL Rahul & Shreyas Iyer in the midst of a match simulation exercise at the KSCA ‘B’ grounds.
— Deepanshu Thakur (@realdpthakur17) August 14, 2023
🎥: Rishabh Pant/Instagram#KLRahul #ShreyasIyer #AsiaCup2023 pic.twitter.com/rDZVfWMpVj
Comments
Please login to add a commentAdd a comment