![Rohit Hits Ground In Style Ahead Asia Cup 2023 Photos Viral - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/19/rohit-sharma.jpg.webp?itok=siKlm12e)
Rohit Sharma Pics Goes Viral: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో దిగాడు. గ్రౌండ్‌లో పరుగులు తీస్తూ ఫిట్‌గా కనిపించిన హిట్‌మ్యాన్.. ఆసియా వన్డే కప్ టోర్నీకి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. కాగా వెస్టిండీస్ పర్యటనలో చివరిగా రోహిత్ వన్డే మ్యాచ్ ఆడాడు.
రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సెంచరీతో చెలరేగిన ఈ ముంబైకర్.. 1-0తో జట్టుకు ట్రోఫీ అందించాడు. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. తొలి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఇక ఈ మ్యాచ్ తర్వాత రోహిత్‌తో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి కూడా మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సారథ్యంలో మిగిలిన రెండు వన్డేల్లో ఒకటి గెలిచిన టీమిండియా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.
ఈ సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్, కోహ్లి భారత్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆసియా వన్డే కప్ ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికగా ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దొరికిన విరామ సమయాన్ని రోహిత్ శర్మ ప్రాక్టీస్ కోసం కేటాయించాడు.
ఇందుకు సంబంధించిన ఫొటోలను హిట్‌మ్యాన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. ఇందులో టీ షర్ట్, షార్ట్స్‌లో జాగింగ్ షూ వేసుకుని రోహిత్ స్టైలిష్‌గా కనిపించాడు. ఇక ఆసియా కప్ టోర్నీకి సమయం సమీపిస్తున్న తరుణంలో ఆగష్టు 23న అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రిపోర్టు చేయనున్నట్లు సమాచారం.
వారం రోజుల పాటు అక్కడే శిక్షణా శిబిరంలో ఉండనున్నాడు. ఇదిలా ఉంటే.. జస్‌ప్రీత్ బుమ్రా సారథ్యంలో యువ ఆటగాళ్లుతో కూడిన భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆగష్టు 18న మొదలైన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉంది.
చదవండి: అప్పట్లో ఒకడుండేవాడు.. అతడే ధోని! కానీ రోహిత్ మాత్రం: పాక్ దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment