Asia Cup 2023: ఆసియా కప్-2023 నేపథ్యంలో టీమిండియా సన్నాహకాలు మొదలయ్యాయి. జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణా శిబిరానికి హాజరయ్యేందుకు భారత జట్టు ఆటగాళ్లు పయనమయ్యారు. విమానంలో బెంగళూరుకు బయల్దేరారు.
కాగా ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ ఆరంభం కానుంది. ఈసారి వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 17 మంది సభ్యులతో పాటు స్టాండ్ బైగా సంజూ శాంసన్‌ను ఎంపిక చేసింది.
గాయం కారణంగా జట్టుకు దూరమై జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రస్తుతం పునరావాసం పొందుతున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఈ ఈవెంట్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే.. వెన్నునొప్పితో ఏడాది కాలంగా ఆటకు దూరమైన ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇటీవలే పునరాగమనం చేశాడు.
ఐర్లాండ్ పర్యటనలో టీ20 సిరీస్‌లో భాగంగా.. ఘనంగా కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఇక బుమ్రా నేతృత్వంలో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా బుధవారం నాటి ఆఖరి టీ20 ముగిసిన తర్వాత భారత్‌కు పయనం కానుంది.
వీరి సంగతి ఇలా ఉంటే.. సెలవుల్లో ఉన్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి బెంగళూరుకు చేరుకుంటున్నారు. మిగతా వాళ్లు కూడా వచ్చిన తర్వాత ఆగష్టు 29 వరకు ట్రెయినింగ్ క్యాంపు నిర్వహించనుంది బీసీసీఐ.
ఆసియా కప్-2023కి ఎంపికైన జట్టులోని సభ్యులు మాత్రమే ఈ శిక్షణా శిబిరంలో పాల్గొననున్నారు. హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథోడ్ మార్గదర్శనంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయనున్నారు. ఇక ఈ మెగా ఈవెంట్లో భాగంగా సెప్టెంబరు 2న శ్రీలంకలో పాకిస్తాన్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది
చదవండి: Heath Streak: హీత్ స్ట్రీక్ బతికే ఉన్నాడు.. నీకసలు బుద్ధుందా? ఫ్యాన్స్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment