టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దాదాపు ఏడాది నుంచి జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. అయితే అతడు ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించాడని, నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడని బీసీసీఐ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. బుమ్రా రోజుకు 7 నుంచి 8 గంటలు నెట్‌ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో బుమ్రా విండీస్ టూర్ తర్వాత ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో తిరిగి మైదానంలో అడగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఐర్లాండ్ సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉంటాడో లేదో తనకు ఇంకా తెలియదని రోహిత్ తెలిపాడు. విండీస్‌తో తొలి వన్డేకు ముందు ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడిన హిట్‌మ్యాన్ ఈ వాఖ్యలు చేశాడు.
"బుమ్రా జట్టులో తిరిగి రావడం చాలా ముఖ్యం. అతడు చాలా పెద్ద గాయం నుంచి కోలుకున్న తర్వాత తిరిగి ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాబట్టి అందుకు తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఐర్లాండ్‌కు వెళ్తాడో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. మేము ఇంకా ఈ విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని రోహిత్ పేర్కొన్నాడు.
ఇక గురువారం బార్బోడస్ వేదికగా విండీస్‌తో జరగున్న తొలి వన్డేకు టీమిండియా అన్ని విధాల సిద్దమవుతోంది. అయితే ఈ వన్డే సిరీస్ మొత్తానికి టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. వర్క్‌లోడ్ కారణంగా సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
చదవండి: IND vs WI: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. అలా అయితే సచిన్, గంగూలీ!
🚨Rohit Sharma PC:
— RevSportz (@RevSportz) July 26, 2023
He believes that playing 11-12 ODIs will provide a decent time to select the best combination before #ODIWorldCup2023.
Also shares his thoughts on #JaspritBumrah's potential comeback.
Full press conference 👇@Wowmomo4u @ImRo45 #WIvIND #IndianCricket pic.twitter.com/HexZXYcLpq
Comments
Please login to add a commentAdd a comment