బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఆదివారం(సెప్టెంబర్ 8) ప్రకటించింది. ఈ సిరీస్‌తో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పునరాగమనం చేయనున్నాడు.
దాదాపు 500 రోజుల తర్వాత పంత్‌కు భారత టెస్టులో చోటు దక్కింది. మరోవైపు శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలు తిరిగొచ్చారు. అంతేకాకుండా గుజరాత్ పేసర్ యశ్ దయాల్‌కు తొలి సారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.
భారత వైస్ కెప్టెన్ ఎవరు?
ఇక ఇది ఇలా ఉండగా.. బంగ్లాతో టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ డిప్యూటీ ఎవరన్నది అందరి మెదడలను తొలుస్తున్న ప్రశ్న. ఈ సిరీస్ ముందు వరకు టెస్టుల్లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గా పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యవహరించాడు.
కానీ ఈసారి వైస్ కెప్టెన్ ఎవరన్నది సెలక్టర్లు ప్రకటించలేదు. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ వచ్చే ఏడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ తర్వాత తప్పుకునే అవకాశమున్నందన... బీసీసీఐ ఫ్యూచర్ కెప్టెన్‌ను వెతికే పనిలో పడింది.
ఈ క్రమంలోనే ఇప్పటికే శుభమన్ గిల్‌ను రెండు వైట్-బాల్ ఫార్మాట్లలో వైస్ కెప్టెన్‌గా ప్రకటించిన బీసీసీఐ.. టెస్టుల్లో కూడా అతడినే రోహిత్ డిప్యూటీగా నియమించాలని భావిస్తోంది. అయితే ఈ సిరీస్‌లో మాత్రం జస్ప్రీత్ బుమ్రానే మైదానంలో రోహిత్‌కు సహాయం చేసే అవకాశం ఉంది.
స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు గిల్ వైస్ కెప్టెన్సీ సంబంధించి బీసీసీఐ అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. కాగా బంగ్లాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది.
తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశి్వన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.
Comments
Please login to add a commentAdd a comment