టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై యూఏఈ పేసర్, పాక్ మూలాలున్న క్రికెటర్ జహూర్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్-2014 సీజన్‌లో ముంబై ఇండియన్స్ నెట్‌బౌలర్‌గా వ్యవహరించిన జహూర్ ఖాన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రోహిత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.
రోహిత్ శర్మ ఒక అద్బుతమైన క్రికెటర్ అని, అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడని జహూర్ ఖాన్ కొనయాడాడు. అదే విధంగా నెట్స్‌లో రోహిత్‌కు బౌలింగ్ చేసేటప్పుడు అతడికి ఎదురైన అనుభవాలను ఈ యూఏఈ స్టార్ పేసర్ పంచుకున్నాడు.
రోహిత్ చాలా గ్రేట్..
రోహిత్ శర్మ అందరితో సరదాగా ఉంటాడు. నేను ఐపీఎల్-2014 సీజన్‌లో ముంబై ఇండియన్స్ నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాను. వాంఖడేలో ప్రాక్టీస్ సందర్భంగా రోహిత్ నా దగ్గరకు వచ్చి స్టేడియం మొత్తం మీదే, ఏదైనా అవసరమైతే నాకు చెప్పండి అంటూ అన్నాడు.
ఆ రోజే రోహిత్ భయ్యా అంటే ఏంటో నాకు ఆర్ధమైంది. నేను నెట్స్‌లో రోహిత్ శర్మకు బౌలింగ్ కూడా చేసాను. అతడికి ఓసారి స్లో బాల్ బౌల్ చేసాను. ఆ సమయంలో రోహిత్ నేను వేసిన స్లో డెలివరీలను ఎదుర్కోలేకపోయాడు. వెంటనే రోహిత్ భయ్యా ఇంత స్లోగా ఎలా బౌల్ చేస్తున్నావు?అని నన్ను అడిగాడు.
అంతేకాకుండా మీ స్లో బంతులను ఏ బ్యాటర్ కూడా సిక్సర్‌గా మలచలేడని రోహిత్ చెప్పాడు. ముంబై ఇండియన్స్‌తో మూడు నెలల పాటు ప్రయాణం చేశాను. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాతో నాకు మంచి అనుబంధం ఉంది.
బుమ్రా సైతం నా బౌలింగ్‌ను మెచ్చుకున్నాడు. స్లోయర్ డెలివరీని ఎలా బౌల్ చేయగల్గుతున్నావు? అని బుమ్రా నన్ను అడిగాడు. ప్రపంచ నెం1 బౌలర్ నన్ను అలా అడగడం చాలా గర్వంగా అన్పించింది. ఓ టీ10 టోర్నమెంట్‌లో నేను మెయిడెన్ బౌలింగ్ చేసిన ఓవర్ వీడియోను కూడా బుమ్రా చూశాడు.
నేను కూడా కొత్త బంతితో యార్కర్లను ఎలా బౌలింగ్ చేయగల్గుతున్నారు అని బుమ్రాను అడిగాను. ప్రపంచంలో కొత్త బంతితో యార్కర్లు వేసే బౌలర్లు ఇద్దరే ఇద్దరు. ఒకరు లసిత్ మలింగా, ఇంకొకరు జస్ప్రీత్ బుమ్రా అని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జహూర్ ఖాన్ పేర్కొన్నాడు.
చదవండి: కోహ్లి, రోహిత్ కాదు!.. ఆ షాట్లు ఆడటంలో వాళ్లే బెస్ట్: అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment