భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు సమయం దగ్గరపడుతోంది. ఆక్టోబర్ 5న చెన్నై వేదికగా న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య జరగనునున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఆయా జట్లు తమ సన్నహాకాలు కూడా ప్రారంభించాయి. ఆస్ట్రేలియా అయితే ఒక అడుగు ముందుకు వేసి ఈ మెగా ఈవెంట్ కోసం తమ ప్రిలిమినరీ జట్టును కూడా ప్రకటించింది. టీమిండియా విషయానికి వస్తే.. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఆసియా వన్డే కప్, ఆస్ట్రేలియాతో స్వదేశంలో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.
అయితే ఈ మెగా టోర్నీకి ముందు భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి కోలుకుని మైదానంలో అగుడుపెట్టేందుకు సిద్దం కాగా.. కీలక ఆటగాళ్లు కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్ ఇంకా సందిగ్ధం గానే ఉంది. ఈ క్రమంలో ప్రపంచకప్‌కు భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందో అని అందరూ అతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రపంచకప్‌లో భాగమయ్యే జట్లు తమ 15 మంది సభ్యుల వివరాలను సెప్టెంబర్5 లోపు ఐసీసీకి సమర్పించాలి. ఈ క్రమంలో భారత జట్టును బీసీసీఐ ఆగస్టు ఆఖరి వారంలో ప్రకటించే అవకాశం ఉంది.
వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత జట్టును ఉద్దేశించి టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ కీలక వాఖ్యలు చేశాడు. జట్టుకు మంచి కెప్టెన్ ఉంటే సరిపోదని, కీలక ఆటగాళ్లు కూడా ఉండాలని యువీ అన్నాడు. "రోహిత్ శర్మ మంచి కెప్టెన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముంబై ఇండియన్స్‌కు చాలా సీజన్ల నుంచి సారధిగా వ్యవహరిస్తున్నాడు. అతడు ముంబై జట్టుకు ఐదు టైటిల్స్‌ను అందించాడు. రోహిత్ గొప్ప లీడర్‌గా మారాడు. అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. ఒత్తిడిలో కూడా చాలా తెలివిగా రోహిత్ వ్యవహరిస్తాడు.
అయితే ఐసీసీ టైటిల్ నెగ్గాలంటే మంచి కెప్టెన్ ఉంటే పోదు, అత్యుత్తమ జట్టు కూడా ఉండాలి. అందులో అనుభవం ఉన్న ఆటగాళ్లు భాగం కావాలి. ఆ బాధ్యత సెలక్టర్లు తీసుకోవాలి. భారత్‌కు రెండు టైటిల్స్‌ను అందించిన ధోని కూడా అత్యుత్తమ కెప్టెన్. కానీ ధోనికి అనుభవం ఉన్న ఆటగాళ్లు సపోర్ట్ కూడా ఉండేది. అయితే ఈ సారి సరైన జట్టుతో బరిలోకి దిగకపోతే విజయం సాధించడం కష్టమే" అని ఇంద్రనీల్ బసుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ పేర్కొన్నాడు. కాగా 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత్ సొంతంచేసుకోవడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
చదవండి: IND Vs WI 3rd T20I: వెస్టిండీస్‌తో మూడో టీ20.. కిషన్‌పై వేటు! యువ సంచలనం ఎంట్రీ! అతడికి ఆఖరి ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment