
ఐపీఎల్-2023లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కొనసాగుతుంది. ఈ ఏడాది మెగా టోర్నీలో వరుసగా రెండో ఓటమిని ముంబై చవిచూసింది. శనివారం వాంఖడే వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 7వికెట్ల తేడాతో ముంబై పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ముంబై విఫలమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకు ఓపెనర్లు రోహిత్ శర్మ(21), కిషన్(32) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.
తొలి వికెట్‌కు వీరిద్దరూ 38 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం కిషన్ తన దూకుడును కొనసాగించి పవర్‌ప్లే ముగిసేసరికి తమ స్కోర్ బోర్డును 60 పరుగులు దాటించాడు. అయితే కిషన్ ఔటైన అనంతరం ముంబై పతనం మొదలైంది. వరుస క్రమంలో ముంబై ఇండియన్స్ వికెట్లు కోల్పోయింది.
ఆఖరిలో టిమ్ డేవిడ్(31) పరుగులతో రాణించడం వల్ల ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు సాధించింది. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే కేవలం 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 18.1 ఓవర్లలో చేధించింది. సీఎస్‌కే బ్యాటర్లో రహానే( 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 61 పరుగులు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు రుత్‌రాజ్ గైక్వాడ్(40) పరుగులతో రాణించాడు.
ముఖం దాచుకున్న రోహిత్ శర్మ
ఇక సీఎస్‌కే చేతిలో ఘోర ఓటమిని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ జీర్ణించుకోలేకపోయాడు. సీఎస్‌కే విజయం సాధించగానే రోహిత్ తన క్యాప్‌తో ముఖం దాచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
చదవండి: Rahane-Dhoni: రహానేకు ధోని ఏం చెప్పి పంపించాడో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment