టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ప్రాక్టీస్ ముగిసింది. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా మంచి విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్ వర్షార్పణం కావడంతో ఇక టీమిండియా నేరుగా ఆదివారం(అక్టోబర్ 23న) పాకిస్తాన్‌తో తలపడనుంది. ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇదే తొలి టి20 ప్రపంచకప్. 2007లో టీమిండియా గెలిచిన వరల్డ్‌కప్‌లో సభ్యుడిగా ఉన్న రోహిత్.. ఈసారి మాత్రం కెప్టెన్ హోదాలో జట్టుకు టైటిల్ అందించాలని భావిస్తున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
''మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు ప్రశాంతంగా ఉండి సంయమనం పాటిస్తేనే కోరుకున్న ఫలితాలు వస్తాయి. టీమిండియా ప్రపంచకప్ గెలిచి చాలా కాలమే అయిపోయింది. ఎలాగైనా కప్ గెలవాలన్నదే మా లక్ష్యం. కానీ అందుకోసం చాలానే చేయాల్సి ఉంది. ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లాలి. వార్మప్ మ్యాచ్‌లు ముగిశాయి..ఇక అసలు పోరు మొదలు కానుంది. పాక్‌తో మ్యాచ్‌ను సాధారణంగానే తీసుకుంటున్నాం. ఎంత చిరకాల ప్రత్యర్థి అయినా గెలుపోటములు సహజం.
పాకిస్తాన్‌తో మ్యాచ్ అనగానే ఒత్తిడి ఉంటుంది. కానీ ఇలాంటివి పట్టించుకోము. సెమీ ఫైనల్స్, ఫైనల్స్ గురించి ఇప్పుడే ఆలోచించం. ముందు సూపర్-12లో మంచి ప్రదర్శన చేయాలనుకుంటున్నాం. ఇక జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవం. కెప్టెన్‌గా నాకు ఇదే తొలి ప్రపంచకప్.ఒక జట్టుగా చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఆస్ట్రేలియాలో పిచ్‌లు భిన్నంగా ఉంటాయి.. మాకు ఇది సవాలుతో కూడుకున్నది. అందుకే అందరికంటే ముందుగా ఇక్కడ అడుగుపెట్టాం.'' అంటూ ముగించాడు.
From leading India for the first time in ICC World Cup to the team's approach in the #T20WorldCup ! 👌 👌
— BCCI (@BCCI) October 19, 2022
💬 💬 In conversation with #TeamIndia captain @ImRo45!
Full interview 🎥 🔽https://t.co/e2mbadvCnU pic.twitter.com/fKONFhKdga
చదవండి: స్లో ఓవర్ రేట్.. క్రికెట్ ఆస్ట్రేలియా వినూత్న ఆలోచన
Comments
Please login to add a commentAdd a comment