Rohit Sharma Shocked by Virat Kohli Decision to Step Down Test Captaincy - Sakshi
Sakshi News home page

Rohit Sharma- Virat Kohli: కోహ్లి నిర్ణయం విని షాకయ్యాను.. రోహిత్‌ శర్మ పోస్టు వైరల్‌

Published Sun, Jan 16 2022 10:38 AM | Last Updated on Sun, Jan 16 2022 11:13 AM

Rohit Sharma Shocked By Virat Kohli Decision Quit Test Captaincy Post Viral - Sakshi

కోహ్లి నిర్ణయం విని షాకయ్యాను.. రోహిత్‌ శర్మ పోస్టు వైరల్‌

Rohit Sharma Shocked By Virat Kohli Decision: టెస్టు క్రికెట్‌లో భారత జట్టును అత్యున్నత శిఖరాలకు చేర్చిన సారథిగా విరాట్‌ కోహ్లి పేరు నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడి సారథ్యంలోనే టీమిండియా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ వంటి విదేశీ గడ్డలపై చిరస్మరణీయ విజయాలు సాధించి సత్తా చాటింది. మొత్తంగా 68 టెస్టులకు నాయకత్వం వహించిన కోహ్లి.. 40 మ్యాచ్‌లు గెలుపొంది విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందాడు. అయితే, దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించాలన్న అతడి కల మాత్రం నెరవేరలేదు. 2-1 తేడాతో సఫారీల చేతిలో ఓటమితో భారత్‌కు నిరాశే మిగిలింది. 

దీంతో.. టీ20 కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పిన తనను.. బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం వంటి పరిణామాల నేపథ్యంలో సౌతాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించాలన్న కోహ్లికి చేదు అనుభవం ఎదురైంది.  ఈ క్రమంలో తాను టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు శనివారం సంచలన ప్రకటన చేశాడు కోహ్లి. ఈ విషయంపై స్పందించిన పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. కోహ్లి నిర్ణయం తనను విస్మయానికి గురిచేసిందన్నాడు.

ఈ మేరకు... ‘‘షాక్‌ అయ్యాను!! భారత జట్టు కెప్టెన్‌గా విజయవంతమైన నీకు శుభాకాంక్షలు కోహ్లి.. నీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ కోహ్లితో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌ అవుతోంది. కాగా కోహ్లిని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ.. రోహిత్‌ను సారథిగా నియమించిన సంగతి తెలిసిందే. అయితే, గాయం కారణంగా రోహిత్‌ దక్షిణాఫ్రికా పర్యటనకు దూరం కాగా... వన్డే సిరీస్‌కు కేఎల్‌ రాహుల్‌ సారథిగా వ్యవహరించనున్నాడు.

చదవండి: Virat Kohli Quit Test Captaincy: టెస్టు కెప్టెన్సీకి కోహ్లి గుడ్‌ బై.. అది తన వ్యక్తిగత నిర్ణయమన్న గంగూలీ 
Virat Kohli: ఆ కారణంగానే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement