శెభాష్ హిట్‌మ్యాన్‌.. రోహిత్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా!(వీడియో) | Rohit Sharma Stops His Car in Busy Mumbai Streets, Wishes Fan on Her Birthday | Sakshi
Sakshi News home page

శెభాష్ హిట్‌మ్యాన్‌.. రోహిత్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా!(వీడియో)

Published Wed, Oct 9 2024 12:22 PM | Last Updated on Wed, Oct 9 2024 12:59 PM

Rohit Sharma Stops His Car in Busy Mumbai Streets, Wishes Fan on Her Birthday

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భార‌త జ‌ట్టు ఇప్పుడు స్వ‌దేశంలో మ‌రో స‌వాల్‌కు సిద్ద‌మైంది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. ఆక్టోబ‌ర్ 16 నుంచి బెంగ‌ళూరు వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

అయితే ఈ సిరీస్ కోసం భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టేశాడు. బంగ్లాతో టెస్టు సిరీస్ అనంత‌రం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న రోహిత్‌.. మ‌ళ్లీ నెట్స్‌లో బీజీ అయిపోయాడు. ముంబైలోని జియో పార్క్ స్టేడియంలో త‌న స‌న్న‌హాకాల‌ను ప్రారంభించాడు.

హిట్‌మ్యాన్ మంచి మ‌నసు..
ఇక ఇది ఇలా ఉండగా.. తాజాగా హిట్‌మ్యాన్ త‌న మంచి మ‌న‌సును చాటుకున్నాడు. భారత కెప్టెన్ తన లంబోర్ఘిని కారులో జియో పార్క్ స్టేడియంకు వెళ్తుండ‌గా ముంబైలో ఓ సిగ్నల్ వ‌ద్ద ఆగాడు. ఈ క్ర‌మంలో ఓ లేడి ఫ్యాన్ అత‌డి కారు వ‌ద్ద‌కు ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి ఫోటో దిగేందుకు ప్ర‌య‌త్నించింది.

 రోహిత్ కూడా న‌వ్వుతూ ఫోటోకు ఫోజు ఇచ్చాడు. అంతేకాకుండా ఆమె త‌న బ‌ర్త్‌డే అని చెప్ప‌గా.. వెంట‌నే హిట్‌మ్యాన్ షేక్ హ్యాండ్ ఇస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

ఇది చూసిన నెటిజ‌న్లు శెభాష్ హిట్‌మ్యాన్‌, 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ అంటూ కొనియాడుతున్నారు. కాగా బంగ్లా సిరీస్‌లో రోహిత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. రెండు టెస్టుల్లో కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు. ఇక భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆర్హత సాధించాలంటే కివీస్ సిరీస్ చాలా కీలకం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement