అమెరికాలో రోహిత్‌ బిజీ బిజీ! | Rohit Sharma In USA, Virat In London, Enjoying Vacations With Families Video Goes Viral | Sakshi
Sakshi News home page

అమెరికాలో రోహిత్‌.. లండన్‌లో కోహ్లి

Published Thu, Jul 18 2024 4:18 PM | Last Updated on Thu, Jul 18 2024 4:44 PM

Rohit Sharma In USA, Virat In London

టీ20 వరల్డ్‌కప్‌లో విజయానంతరం పొట్టి ఫార్మాట్‌కు (ఇంటర్నేషనల్‌) వీడ్కోలు పలికిన టీమిండియా స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి ప్రస్తుతం తమతమ కుటుంబాలతో కలిసి హాలిడేలో ఉన్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లకు ప్రస్తుతం ఎలాంటి అంతర్జాతీయ కమిట్‌మెంట్స్‌ లేకపోవడంతో ఖాళీ సమయాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. 

రోహిత్‌ అమెరికాలో హాలిడేను ఎంజాయ్‌ చేయడంతో పాటు పలు క్రికెట్‌ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుండగా, కోహ్లి.. కొడుకు అకాయ్‌ని భుజానేసుకుని లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. రోహిత్‌, కోహ్లిలను అనునిత్యం ఫాలో​ అయ్యే క్రికెట్‌ లవర్స్‌ ఈ ఇద్దరి అప్‌డేట్స్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌ అనంతరం టీమిండియా.. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ను శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలోని యువ భారత జట్టు 4-1 తేడాతో కైవసం చేసుకుంది. టీమిండియా ఈ నెల 27 నుంచి శ్రీలంకలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్‌ టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం జట్లను ఇవాళ (జులై 18) ప్రకటించే అవకాశం ఉంది. 

భారత్‌.. శ్రీలంక పర్యటన టీ20 సిరీస్‌తో మొదలవుతుంది. 27, 28, 30 తేదీల్లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం ఆగస్ట్‌ 2, 4, 7 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. టీ20 సిరీస్‌ మొత్తం పల్లెకెలెలో.. వన్డే సిరీస్‌ కొలొంబోలో జరుగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement