వరల్డ్‌కప్-2023కు ముందు జరిగే ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం భారత జట్టును నిన్న (సెప్టెంబర్ 18) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టులో డాషింగ్ ప్లేయర్ సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. ఆసియా కప్ కోసం ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపికైన సంజూ అటు ఆసీస్ టూర్‌కు ఎంపిక కాకపోగా, ఇటు ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు.
Sanju Samson posted a cryptic message on social media after he was dropped from India's squad for the ODI series against Australia. pic.twitter.com/a9DlYVC1WE
— CricTracker (@Cricketracker) September 19, 2023
స్వదేశంలో జరిగే వరల్డ్‌కప్‌లో ఆడాలని గంపెడాశలు పెట్టుకున్న సంజూ.. కేఎల్ రాహుల్ ఆగమనంతో ఆ ఆశలను వదులుకున్నాడు. ఈ మధ్యలో అతనికి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడే అవకాశం కూడా వచ్చింది. అయితే, సంజూ ఆసియా కప్‌కు ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక కావడంతో కౌంటీ ఛాన్స్ కూడా మిస్ అయ్యింది. మొత్తంగా చూస్తే సంజూ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారింది.
Irfan Pathan and Robin Uthappa react to Sanju Samson’s axe for the ODI series against Australia. pic.twitter.com/rRU9TtSfnm
— CricTracker (@Cricketracker) September 19, 2023
ఇటు టీమిండియాలో చోటు దక్కక, అటు కౌంటీ ఛాన్స్ మిస్ అయి సంజూ చాలా నష్టపోయాడు. ఆసీస్ సిరీస్ కోసం నిన్న భారత జట్టును ప్రకటించిన అనంతరం శాంసన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. టీమిండియాకు ఎంపిక కాలేదన్న బాధను దిగమింగుతూనే స్మైలింగ్ ఏమోజీని పోస్ట్ చేశాడు. ఇది చూసి నెటిజన్లు శాంసన్‌పై సానుభూతిని చూపిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్లు సైతం శాంసన్‌ను చూసి జాలి పడుతున్నారు.
Sanju Samson posted another emotional message after being left out of the Indian team's squad.
— CricTracker (@Cricketracker) September 19, 2023
Comeback stronger champ! pic.twitter.com/M5GQuZeIWi
ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేస్తూ.. నేను సంజూ స్థానంలో ఉంటే, చాలా అసంతృప్తితో ఉండే వాడినని అన్నాడు. రాబిన్ ఉతప్ప అయితే.. ఈ పరిస్థితుల్లో ఎవరూ సంజూ స్థానంలో ఉండాలని కోరుకోరు అంటూ ట్వీట్ చేశాడు. తనపై సానుభూతి పవనాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సంజూ తాజాగా మరోసారి స్పందించాడు. జరిగేది జరుగుతుంది.. తాను ముందుకు సాగాలనుకుంటున్నాను అన్న అర్ధం వచ్చేలా ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఇది చూసి అభిమానులు సంజూ ధైర్యాన్ని మెచ్చుకుంటూ, అతనికి అండగా నిలుస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ నెల (సెప్టెంబర్) 22, 24, 27 తేదీల్లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత సెలక్టర్లు నిన్న (సెప్టెంబర్ 18) రెండు వేర్వేరు జట్లను ప్రకటించారు. తొలి రెండు వన్డేలకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లకు సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు. దీంతో ఈ మ్యాచ్‌లలో టీమిండియాకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించనున్నాడు. రోహిత్, కోహ్లి, హార్దిక్, కుల్దీప్ యాదవ్‌లు తిరిగి మూడో వన్డేకు జట్టులో చేరతారు.
ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఆసీస్‌తో మూడో వన్డేకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment