మహిళల క్రికెట్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే వన్డే సిరీస్ షెడ్యూల్ వివరాలను బీసీసీఐ ఇవాళ (అక్టోబర్ 14) ప్రకటించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ అక్టోబర్ 24, 27, 29 తేదీల్లో నరేంద్ర మోదీ స్టేడియం (అహ్మదాబాద్) వేదికగా జరుగనుంది. మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఐసీసీ వుమెన్స్ ఛాంపియన్షిప్‌లో భాగంగా ఈ సిరీస్ జరుగనుంది. వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు ఈ సిరీస్ చాలా కీలకం కానుంది. మరి కొద్ది నెలల్లో న్యూజిలాండ్ వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
ఇదిలా ఉంటే, భారత మహిళా క్రికెట్ జట్టు ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్‌లో కీలక దశ గుండా సాగుతోంది. మెగా టోర్నీలో భారత్ సెమీస్‌కు చేరాలంటే ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ గెలవాల్సి ఉంది. ఇది అంత ఆషామాషీ విషయం కానప్పటికీ అసాధ్యమైతే కాదు. ఈ మ్యాచ్‌లో సానుకూల ఫలితంపై భారత్ గంపెడాశలు పెట్టుకుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ పాక్‌పై విజయం సాధిస్తే భారత్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది. నిన్న జరిగిన కీలక సమరంలో భారత్ ఆస్ట్రేలియా చేతిలో 9 పరుగుల స్వల్ప తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గనక భారత్ గెలిచి ఉంటే న్యూజిలాండ్-పాక్ మ్యాచ్‌తో సంబంధం లేకుండా సెమీస్‌కు చేరి ఉండేది.
Comments
Please login to add a commentAdd a comment