SL Vs WI 2nd Test 2021: Sri Lanka Out For 204 In Their First Innings - Sakshi
Sakshi News home page

SL Vs WI Test Series: 91 పరుగుల వ్యవధిలో తొమ్మిది వికెట్లు.. శ్రీలంక 204 ఆలౌట్‌

Published Wed, Dec 1 2021 8:37 AM | Last Updated on Wed, Dec 1 2021 10:18 AM

SL Vs WI Test Series: Sri Lanka All Out 204 Runs 2nd Test 1st Innings - Sakshi

PC: Sri Lanka Cricket

SL Vs WI Test Series: Sri Lanka All Out 204 Runs 2nd Test 1st Innings: శ్రీలంక, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టును వర్షం వెంటాడుతూనే ఉంది. తొలి రోజు రెండు సెషన్‌ల ఆట పూర్తిగా రద్దు కాగా... రెండో రోజు 57.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వానతో మంగళవారం ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 29.4 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 69 పరుగులు చేసింది. జెర్మైన్‌ బ్లాక్‌వుడ్‌ (44; 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు113/1తో రెండో రోజు ఆటను కొనసాగించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. నిసంక (73; 5 ఫోర్లు, 1 సిక్స్‌), దిముత్‌ కరుణరత్నే (42; 6 ఫోర్లు) రాణించారు. విండీస్‌ బౌలర్లలో వీరసామి పెరుమాళ్‌ (5/35), జొమెల్‌ వరికాన్‌ (4/50) చెలరేగడంతో... శ్రీలంక తమ చివరి తొమ్మిది వికెట్లను 91 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టులో శ్రీలంక 187 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

చదవండి: IPL Retention: ఈ 27 మంది ఓకే.. మరి ఆ ఆరు స్థానాలు.. వార్నర్‌, రాహుల్‌, రషీద్‌, గిల్‌ ఇంకా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement