మహిళల వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తలకు గాయమైంది. సౌతాఫ్రికా మహిళల జట్టుతో ఆదివారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో షబ్నీమ్ ఇస్మాయిల్ విసిరిన బౌన్సర్.. వేగంగా వచ్చి మంధాన హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో మంధాన రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరి, ఆ తర్వాత ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. దీంతో మంధాన తలకు పెద్ద గాయమైందేమోనని ఆమె అభిమానులు ఆందోళన చెందారు. కీలక టోర్నీకి ముందు మంధాన జట్టుకు దూరమైతే టీమిండియా విజయావకాశాలను దెబ్బతీస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
🚨 UPDATE 🚨: Smriti Mandhana stable after being struck on the head in #CWC22 warm-up game. #TeamIndia
— BCCI Women (@BCCIWomen) February 28, 2022
Details 🔽
అయితే మంధాన తలకు తగిలిన గాయం పెద్దది కాదని, కన్‌కషన్ ఏమీ జరగలేదని జట్టు వర్గాలు ఇవాళ వెల్లడించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మహిళల వన్డే ప్రపంచకప్ మార్చి 4 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో మార్చి 6న టీమిండియా.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. అనంతరం మార్చి 10న న్యూజిలాండ్‌తో, మార్చి 12న వెస్టిండీస్‌తో, మార్చి 16న ఇంగ్లండ్‌తో, మార్చి 19న ఆస్ట్రేలియాతో, 22న బంగ్లాదేశ్‌తో, మార్చి 27న దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది.
భారత ప్రపంచకప్ జట్టు: మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్, యాస్తికా భాటియా, స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్
చదవండి: ICC World Cup 2022: ఐసీసీ కీలక నిర్ణయం.. 9 మంది ప్లేయర్స్‌తో బరిలోకి దిగవచ్చు..!
Comments
Please login to add a commentAdd a comment