
టీ20 ప్రపంచకప్-2022 సన్నాహాకాల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాప్రికా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో కేవలం 98 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ బౌలర్లలో కేశవ్ మహారాజ్ మూడు వికెట్లు, షమ్సీ, పార్నెల్ రెండు వికెట్లు, మార్‌క్రమ్,జాన్‌సెన్, రబాడ తలా వికెట్ సాధించారు.
న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిఫ్స్(23), గప్టిల్(23) పరుగులతో టాప్ స్కోరర్‌లగా నిలిచారు. ఇక 99 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాప్రికా కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలోనే ఛేదించింది. దక్షిణాప్రికా బ్యాటర్లలో రుసౌ(54) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.
చదవండి: IND Vs AUS: చెలరేగిన సూర్యకుమార్.. తగ్గేదే లే
Comments
Please login to add a commentAdd a comment