Photo: IPL Twitter
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన సూర్యకుమార్‌కు ఐపీఎల్‌లో ఇదే తొలి సెంచరీ అన్న సంగతి తెలిసిందే. 49 బంతుల్లో 11 ఫోర్లు, ఏడు సిక్సర్లతో వీరవిహారం చేసిన సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ తరపున పలు రికార్డులు నమోదు చేశాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.
► ఐపీఎల్‌లో సూర్యకిది తొలి శతకం. ఇక రెండో సీజన్ ఆడుతున్న గుజరాత్ టైటాన్స్‌పై తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ చేసిన 92 పరుగులే గుజరాత్‌ఫై అత్యధిక స్కోరుగా ఉంది. తాజాగా ఆ రికార్డును సూర్య బద్దలుకొట్టాడు.
► ఇక ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్‌లో సూర్యకుమార్‌ది ఐదో శతకం. ఇంతకముందు సచిన్(100*), సనత్ జయసూర్య(114*), రోహిత్ శర్మ(109*), లెండిల్ సిమ్మన్స్(100*) ఉన్నారు. ఇక్కడ విశేషమేమిటంటే ఐదుగురు సెంచరీలు చేయడంతో పాటు నాటౌట్‌గా నిలిచారు. సూర్య కూడా గుజరాత్‌తో మ్యాచ్‌లో 103 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు.
► ముంబైలోని వాంఖడే స్టేడియంలో 12 ఏళ్ల తర్వాత ముంబై ఇండియన్స్‌కు ఇదే తొలి శతకం. చివరిసారి 2011లో సచిన్ సెంచరీ సాధించాడు. సచిన్ తర్వాత ముంబై వేదికలో సెంచరీ బాదిన క్రికెటర్‌గా సూర్యకుమార్ చరిత్రకెక్కాడు.
A 💯 that wowed teammates, fans and opponents alike 🤩
— JioCinema (@JioCinema) May 12, 2023
Take a bow #SuryakumarYadav 👏#MIvGT #IPLonJioCinema | @surya_14kumar pic.twitter.com/kwUuMfTGKz
Comments
Please login to add a commentAdd a comment