
Team India Cant Take Afghanistan Lightly Says Harbhajan Singh: టీ20 ప్రపంచకప్-2021లో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య అక్టోబర్ 31న జరగనున్న కీలక పోరుకు ముందు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్‌తో పోరును క్వార్టర్ ఫైనల్‌లా చూడొద్దని, ఇదే గ్రూప్‌లో మరో జట్టు నుంచి కోహ్లి సేనకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించాడు. పసికూన స్కాట్లాండ్‌ను 130 పరుగుల భారీ తేడాతో ఓడించిన అఫ్గానిస్తాన్‌ను తక్కువ అంచనా వేయొద్దని, ఆ జట్టు తమదైన రోజున ఎంతటి మేటి జట్టునైనా మట్టికరిపించగలదని, భారత్‌తో పాటు కివీస్, పాక్‌లకు షాక్ ఇవ్వగల సత్తా అఫ్గాన్ జట్టుకు ఉందని అన్నాడు.
ఇదిలా ఉంటే, గ్రూప్-2లో పాక్ ఇప్పటికే రెండు వరుస విజయాల(భారత్, న్యూజిలాండ్‌లపై)తో సెమీస్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకోగా.. రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించేందుకు టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే తమ తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై భారీ విజయం సాధించిన అఫ్గాన్‌ను సైతం ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే అద్భుతమైన రన్‌రేట్(+6.500) కలిగిన అఫ్గాన్.. భారత్, పాక్, న్యూజిలాండ్‌లలో ఏదో ఒక జట్టుకు షాకిచ్చినా.. సెమీస్‌కు చేరడం కష్టమేమీ కాకపోవచ్చని విశ్లేషకుల అంచనా. మరోవైపు టీమిండియా ఇప్పటివరకు ఐసీసీ టోర్నీల్లో ఒక్కసారి కూడా న్యూజిలాండ్‌పై విజయం సాధించకపోవడం టీమిండియా అభిమానులను కలవర పెడుతుంది.
చదవండి: చరిత్ర సృష్టించనున్న మిథాలీ.. తొలి మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డు