టి20 ప్రపంచకప్‌ను టీమిండియా సూపర్‌గా మొదలుపెట్టింది. అక్టోబర్ 23న(ఆదివారం) చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. టీమిండియా స్టార్ కింగ్ కోహ్లి వన్‌మ్యాన్ షో(53 బంతుల్లో 82 నాటౌట్) తన టి20 కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఆఖర్లో హైడ్రామా నెలకొన్నప్పటికి తను అనుభవంతో మ్యాచ్‌ను టీమిండియా వైపుకు లాగాడు. దీంతో కోహ్లిపై క్రికెట్ దిగ్గజాలు సహా టీమిండియా ఫ్యాన్స్, విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. ఇక టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌ను గురువారం నెదర్లాండ్స్‌తో ఆడనుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికి అందరి కళ్లు మరోసారి కోహ్లిపైనే నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలోనే టీమిండియాతో మ్యాచ్‌కు ముందు నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్‌వర్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా కోహ్లి బ్యాటింగ్‌ను మీరెలా అడ్డుకోబోతున్నారంటూ ఎడ్‌వర్డ్స్‌కు ప్రశ్నించారు. దీనికి ఎడ్‌వర్డ్స్ అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. ''మాతో మ్యాచ్‌లో కోహ్లి మాపై కరుణ చూపిస్తాడని భావిస్తున్నా. పాక్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిన కోహ్లి అదే బ్యాటింగ్‌ను మాతో రిపీట్ చేయడనే అనుకుంటున్నాం.'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు.
ఆ తర్వాత మాట్లాడుతూ.. ''సూపర్-12లో ఆడడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఒక పెద్ద జట్టుతో మ్యాచ్ ఆడుతున్నామంటే ఒత్తిడి సహజం.. కానీ అది ఉండేది చాలా తక్కువ. మాకు అవకాశాలు చాలా తక్కువ. వచ్చినవాటిని మాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేము. టీమిండియా ముందు మేం నిలవలేమని తెలుసు.. కానీ గెలవాలనే ప్రయత్నం చేస్తే తప్పు లేదుగా. అలాగే వరల్డ్‌కప్ లాంటి మేజర్ టోర్నీలో అగ్రజట్టుతో ఆడడం గౌరవంగా భావిస్తాం. ఇక వన్డే సూపర్ లీగ్‌లో మేం లేకపోవడం దురదృష్టకరం. అయితే డచ్‌లో క్రికెట్‌పై ఆసక్తి పెరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం'' అంటూ ముగించాడు.
చదవండి: మ్యాచ్ గెలవలేదు లేదంటే ఆ గుర్తులపై పెద్ద చర్చ జరిగేది!
Comments
Please login to add a commentAdd a comment