Aakash Chopra picks his Pakistan XI for clash against India: టి20 ప్రపంచకప్ 2021లో క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న దాయదుల పోరుకు సమయం దగ్గరపడుతోంది. భారత్, పాకిస్తాన్‌లు అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ క్రమంలో మాజీలు, క్రికెట్ నిపుణులు ఏ జట్టు విజయం సాధిస్తుందో, మ్యాచ్‌లో పాల్గోనే తుది జట్లును అంచనా వేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా భారత్‌తో తలపడే పాక్ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించాడు.
హైదర్ అలీ, ఆసిఫ్ అలీలకు తన జట్టులో చోటుఇవ్వలేదు. వీరి స్ధానంలో షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌కు చోటు ఇచ్చాడు. ఇక చోప్రా ప్రకటించిన జట్టులో మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజమ్‌కు ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. వన్‌డౌన్‌లో ఫఖర్ జమాన్.. నాలుగు, ఐదు స్థానాల్లో షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌ను ఎంపిక చేశాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇమాడ్ వసీంకు చోటు కల్పించాడు. ఇక పేస్ బౌలింగ్ విభాగంలో షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ, హారిస్ రౌఫ్‌ను ఎంపిక చేశాడు. కాగా ఇప్పటి వరకు ప్రపంచకప్‌లో భారత్‌పై పాక్ ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు.
ఆకాశ్ చోప్రా పాకిస్తాన్ ప్లేయింగ్ ఎలెవన్:
బాబర్ అజమ్ (కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షహీన్ షా అఫ్రిది
చదవండి: T20 World Cup: నువ్వసలు ఏం చేస్తున్నావు బాబర్.. టీమిండియాను చూసి నేర్చుకోండి
Comments
Please login to add a commentAdd a comment