ICC T20 World Cup 2021: వచ్చే నెలలో ఆరంభం కానున్న ఐసీసీ మెగా ఈవెంట్ టీ20 ప్రపంచకప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రధాన దేశాలన్నీ తమ టీ20 జట్లను ప్రకటించగా.. టోర్నీ విజేత గురించి అప్పుడే చర్చ మొదలైంది. తమ ఫేవరెట్ జట్ల బలాబలాలు, గెలిచేందుకు వారికి గల అర్హత గల గురించి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డిబేట్లు మొదలెట్టేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం ఈ విషయంపై స్పందించాడు.
ఆకాశ్ చోప్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో #AskAakash పేరిట ట్విటర్‌లో మంగళవారం అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. ‘‘మీ అంచనా ప్రకారం.. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు చేరే నాలుగు జట్లు ఏవి’’ అని ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా.. ‘‘ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్(డిఫెండింగ్ చాంపియన్)’’ అని ఆకాశ్ సమాధానమిచ్చాడు.
అదే విధంగా.. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా స్పిన్ విభాగంలో ఎవరెవరికి చోటు దక్కుతుందని భావిస్తున్నారనగా.. ‘‘జడేజా, అశ్విన్, చహర్ లేదా వరుణ్’’ అని జవాబిచ్చాడు. ఇక టీమిండియా మాజీ కెప్టెన్, టీ20 ప్రపంచకప్ జట్టు మెంటార్ ఎంఎస్ ధోని గురించి రెండు పదాల్లో వర్ణించమని అడగ్గా.. ‘‘జీనియస్, లెజెండ్’’ అని ఆకాశ్ చోప్రా మిస్టర్ కూల్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు యూఏఈ, ఒమన్ వేదికగా ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైన సంగతి తెలిసిందే.
భారత టీ20 ప్రపంచకప్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ ఉన్నారు. స్టాండ్ బై ప్లేయర్స్‌గా శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్.
15 మందితో పాక్ టీ20 ప్రాబబుల్స్:
బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్(వైస్ కెప్టెన్), మహ్మద్ హఫీజ్, ఆసిఫ్ అలీ, అజమ్ ఖాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, ఖుష్దీల్ షా, మొహమ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మొహమ్మద్ వసీం, షాహిన్ అఫ్రిది, సోహైబ్ మక్సూద్.
విండీస్ టీ20 జట్టు ఇదే:
కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), క్రిస్ గేల్, ఫాబియన్ అలెన్, డ్వేన్ బ్రావో, రోస్టన్ చేజ్, ఆండ్రీ ఫ్లెచర్, షిమ్రన్ హెట్‌మైర్, ఎవిన్ లూయిస్, ఒబేడ్ మెక్కాయ్, రవి రాంపాల్, ఆండ్రీ రసెల్, లెండెల్ సిమన్స్, ఒస్నేన్ థామస్, హెడెన్ వాల్ష్ జూనియర్
స్టాండ్ బై ప్లేయర్లు: జాసన్ హోల్డర్, డారెన్ బ్రావో, షెల్డన్ కాట్రెల్, ఏకేల్ హోసిన్
చదవండి: IPL 2021 Phase 2: ఇయాన్ మోర్గాన్ నా గురించి ఏమనుకుంటున్నాడో..
Thank You ☺️ You…the fans of cricket…made it possible 💕 https://t.co/yyNYlGGMH0
— Aakash Chopra (@cricketaakash) September 14, 2021
Comments
Please login to add a commentAdd a comment