
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌కు చేరేందుకు టీమిండియా మరో అడుగు ముందుకు వేసింది. ఛాటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ అద్భుత విజయంతో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 55.7 శాతంతో శ్రీలంకను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (75 శాతం), దక్షిణాఫ్రికా (60 శాతం) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. టీమిండియా ఫైనల్ రేసులో నిలవాలంటే మిగిలిన ఐదు టెస్టుల్లో నాలుగింటిలో విజయం సాధిస్తే చాలు. దక్షిణాఫ్రికాను వెనుక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకుంటుంది.
కాగా భారత్ తమ తదుపరి టెస్టు సిరీస్‌లో స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. ఇక డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన భారత్ 5 మ్యాచ్‌ల్లో విజయం సాదించగా.. 2 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.
చదవండి: IND vs BAN 1st Test: తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం
Comments
Please login to add a commentAdd a comment